Anchor Pradeep: శ్రీముఖి లవ్ ప్రపోజల్.. సిగ్గుమొగ్గలేసిన ప్రదీప్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా హీరో ప్రభాస్ ఉంటే.. బుల్లితెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా యాంకర్ ప్రదీప్ కనిపిస్తున్నాడు. వయసు 35 మీద పడినా పెళ్లి ఊసులేకుండా గడిపేస్తున్న ఈ యాంకర్ కమ్ హీరోకు లేడీ ఫాలోయింగ్ ఏ మాత్రం తక్కువ కాదు.

Anchor Pradeep: శ్రీముఖి లవ్ ప్రపోజల్.. సిగ్గుమొగ్గలేసిన ప్రదీప్!

Anchor Pradeep

Updated On : July 7, 2021 / 11:42 AM IST

Anchor Pradeep: తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా హీరో ప్రభాస్ ఉంటే.. బుల్లితెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా యాంకర్ ప్రదీప్ కనిపిస్తున్నాడు. వయసు 35 మీద పడినా పెళ్లి ఊసులేకుండా గడిపేస్తున్న ఈ యాంకర్ కమ్ హీరోకు లేడీ ఫాలోయింగ్ ఏ మాత్రం తక్కువ కాదు. గడసరి అత్తా సొగసరి కోడలు అంటూ ఆడవారి ప్రోగ్రాంకు మేల్ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన ప్రదీప్ ఇప్పుడు లేడీ ఫాలోయింగ్ లో హీరోలకు ఏ మాత్రం తీసిపోడు. తోటి లేడీ యాంకర్స్ కూడా ప్రదీప్ అంటే నో చెప్పేదే లేదంటారు.

ఆ మధ్య ప్రదీప్ స్వయంవరం ప్రోగ్రాం సమయంలో ఎన్నో రకాలుగా ప్రదీప్ పెళ్లి అంటూ వార్తలు రాగా.. అందులో ఒక కంటెస్టెంట్ తో ప్రదీప్ ప్రేమాయణం అని కూడా వార్తలొచ్చాయి. కానీ అవేమీ నిజాలు కాలేదు. కాగా.. ఇప్పుడు తోటి యాంకర్ శ్రీముఖి ప్రదీప్ మీద మనసు పారేసుకుంది. మనసుపడడమే కాదు స్టేజి మీదనే ఓపెన్ గా ప్రపోజల్ కూడా చేసింది. శ్రీముఖి ప్రేమ ప్రపోజల్ కు ప్రదీప్ సిగ్గుమొగ్గలేశాడు. ఓ టీవీ కార్యక్రమంలో ఇదంతా జరిగింది.

అయితే.. ఇలాంటి కార్యక్రమాలలో ఇలాంటి ప్రపోజల్స్ ఈ మధ్య చాలా సాధారణంగా మారిపోయాయి. బహుశా ఇది కూడా అలానే ఎంటర్టైన్మెంట్ కోసమే అయిఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇది ట్రైలర్ మాత్రమే కాగా ఫుల్ ప్రోగ్రాం ప్రసారమైతే కానీ ఈ ఇద్దరి ప్రపోజల్ వ్యవహారం పూర్తిగా తెలియదు. అన్నట్లు ఈ ప్రోగ్రాంకు సింగర్ సునీత, దర్శకుడు, ఎస్వీ కృష్ణారెడ్డి, కమెడియన్ అలీలు జడ్జిలు కాగా వీరి ముందే శ్రీముఖి ప్రదీప్ కు ఐ లవ్ యూ చెప్పేసింది. మరి ప్రదీప్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో.. ఈ ప్రపోజల్ బాధలు ఎప్పుడు తీరతాయో చూడాలి!