SSMB29 : రాజమౌళి ప్లానింగ్ మాములుగా లేదుగా.. మహేష్ కోసం ఏకంగా లక్షమందితో..
రాజమౌళి ప్రమోషన్ ప్లానింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. (SSMB29)
                            SSMB29
SSMB29 : రాజమౌళి మహేష్ కాంబోలో భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. రాజమౌళి పాన్ వరల్డ్ టార్గెట్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.(SSMB29)
నవంబర్ లో ఈ సినిమా నుంచి మొదటి అప్డేట్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రమోషన్ ప్లానింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే మహేష్ SSMB29 సినిమా ఫస్ట్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేస్తున్నట్టు ఇటీవల అనౌన్స్ చేసారు.
Also Read : Chakda Xpress : వరల్డ్ కప్ గెలిచారు కదా.. ఇప్పటికైనా ఆ సినిమాని రిలీజ్ చేయండి ప్లీజ్.. ఫ్యాన్స్ రిక్వెస్ట్..
నవంబర్ 15న హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ పబ్లిక్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు మూవీ యూనిట్. ఈ ఈవెంట్ కి మహేష్ బాబు, రాజమౌళి హాజరు కానున్నట్టు సమాచారం. ఈ ఈవెంట్లో రాజమౌళి – మహేష్ సినిమా టైటిల్ ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. ఈ ఈవెంట్ ని అన్ని సినిమా ఈవెంట్స్ లాగా యూట్యూబ్ లో చూడలేము. జియో హాట్ స్టార్ ఓటీటీకి రాజమౌళి ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను అమ్మారు. దీంతో మహేష్ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ని నవంబర్ 15న జియో హాట్ స్టార్ లో చూడాల్సిందే.
జియో హాట్ స్టార్ తో పాన్ ఇండియా ప్రమోషన్ చేస్తే ఇక్కడ లోకల్ లో భారీగా ఫ్యాన్స్ మధ్య చేస్తున్నారు. ఏకంగా లక్ష మంది ఫ్యాన్స్ మధ్య రామోజీ ఫిలిం సిటీలో పబ్లిక్ ఈవెంట్ జరగనుందని తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి లక్ష మంది వరకు ఫ్యాన్స్ కి అనుమతి ఇస్తారట. భారీగా పబ్లిక్ ఈవెంట్ ని ప్లాన్ చేయనున్నారు. దీంతో సినిమా టైటిల్ అనౌన్స్ కే ఈ రేంజ్ ప్రమోషన్ చేస్తున్నారంటే మున్ముందు ఈ సినిమాకు రాజమౌళి ఇంకే రేంజ్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తాడో చూడాలి.

Also Read : Rashmika Mandanna : ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూడాలి.. రష్మిక ట్వీట్ వైరల్..
