Kantara: కాంతార దర్శకుడితో స్టార్ క్రికెట్ ప్లేయర్ ఎబి డివిలియర్స్‌..

రిషబ్ శెట్టి, సప్తమి గౌడ హీరో హీరోయిన్ గా కన్నడలోని అద్యత్మిక నేపథ్యంతో తెరకెక్కిన సినిమా ‘కాంతార’. ఇక దేశవ్యాప్తంగా కాంతార ప్రమోషన్స్ చేసే పనిలో ఉన్న రిషబ్ గురువారం దక్షిణాఫ్రికా క్రికెటర్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఎబి డివిలియర్స్‌ను కలిశాడు.

Kantara: కాంతార దర్శకుడితో స్టార్ క్రికెట్ ప్లేయర్ ఎబి డివిలియర్స్‌..

Star cricket player AB de Villiers with Kantara director

Updated On : November 4, 2022 / 10:48 AM IST

Kantara: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ హీరో హీరోయిన్ గా కన్నడలోని అద్యత్మిక నేపథ్యంతో తెరకెక్కిన సినిమా ‘కాంతార’. KGF సినిమాని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని నిర్మించగా, రిషబ్ శెట్టి సొంత దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చిత్రీకరించాడు. మొదటిగా కన్నడలో విడుదలయిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయడంతో, మేకర్స్ ఇతర భాషలోకి కూడా అనువదించి విడుదల చేశారు.

Kantara: కాంతార ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లేనా.. ఈసారైనా వస్తుందా?

ఇక తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. కాగా దేశవ్యాప్తంగా కాంతార ప్రమోషన్స్ చేసే పనిలో ఉన్న రిషబ్ గురువారం దక్షిణాఫ్రికా క్రికెటర్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఎబి డివిలియర్స్‌ను కలిశాడు. రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎబి డెవిలియర్స్ తో ఉన్న ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

ఆ వీడియోలో డివిలియర్స్‌, రిషబ్ తో కలిసి కాంతార అని చెబుతున్నాడు. “ఇది ఒక మ్యాచ్. ఈ రోజు మిస్టర్ 360ని కలుసుకున్నాను. సూపర్‌హీరో మళ్లీ బెంగుళూరుకు తిరిగి వచ్చాడు” అని రిషబ్ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు.అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్‌ ఇప్పుడు ఈ కాంతార ప్రమోషనల్ వీడియోలో కనిపించేపాటికి, అభిమానులు వీడియోని షేర్లు చేస్తూ వారి అభిమానాన్ని తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rishab Shetty (@rishabshettyofficial)