Kantara: కాంతార ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లేనా.. ఈసారైనా వస్తుందా?

కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కన్నడలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ రెడీ అయ్యిందట.

Kantara: కాంతార ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లేనా.. ఈసారైనా వస్తుందా?

Kantara To Lock OTT Premiere On This Date

Kantara: కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కన్నడలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు.

Kantara: కాంతార సినిమా వీక్షించిన నిర్మలా సీతారామన్..

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్‌గా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. పూర్తిగా డివైన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను రిషబ్ శెట్టి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడంతో ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినినిస్తోంది.

Kantara: కాంతార తొలి హీరో రిషబ్ కాదా.. ఆయన అయి ఉంటే వేరే లెవెల్..!

ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ రెడీ అయ్యిందట. ఇటీవల ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ రెడీ అవగా, కాంతార చిత్ర నిర్మాతలు ఈ సినిమాను ఇప్పుడే రిలీజ్ చేయొద్దంటూ రిక్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 18న ఓటీటీ స్ట్రీమింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.