December Film Releases: ఇయర్ ఎండ్ సిల్వర్ స్క్రీన్ స్టార్ హీరోలదే!

ఈనెల వరకూ చిన్న సినిమాలతో ధియేటర్లు కళకళలాడాయి. ఇక పెద్ద సినిమాల పండగొస్తోంది. ఇయర్ ఎండ్ కి సిల్వర్ స్క్రీన్ స్టార్ హీరోల సినిమాలతో దద్దరిల్లబోతోంది. ఇప్పటికే లేటయినందుకుంటున్న..

December Film Releases: ఇయర్ ఎండ్ సిల్వర్ స్క్రీన్ స్టార్ హీరోలదే!

December Film Releases (1)

Updated On : November 27, 2021 / 6:47 PM IST

December Film Releases: ఈనెల వరకూ చిన్న సినిమాలతో ధియేటర్లు కళకళలాడాయి. ఇక పెద్ద సినిమాల పండగొస్తోంది. ఇయర్ ఎండ్ కి సిల్వర్ స్క్రీన్ స్టార్ హీరోల సినిమాలతో దద్దరిల్లబోతోంది. ఇప్పటికే లేటయినందుకుంటున్న సినిమాలు వరుస పెట్టి డిసెంబర్ లో రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. ఇప్పటి వరకూ ఆచితూచి సినిమాలు రిలీజ్ చేసిన స్టార్లు.. ఇప్పుడు వరస పెట్టి రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నారు. డిసెంబర్ లో ఒక్క వారం కూడా గ్యాప్ లేకుండా రిలీజ్ అవుతున్నాయి.

Hebah Patel: ‘అబ్బా.. హెబ్బా’.. ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న పిక్స్

సీనియర్ హీరో బాలకృష్ణ డిసెంబర్ 2న గ్రాండ్ గా ధియేటర్లోకి వస్తున్నారు. అదే రోజు మోహన్ లాల్ మళయాళ మూవీ మరక్కార్ రిలీజ్ అవుతోంది. గురువారం ఆల్రెడీ పెద్ద సినిమాలు ఉండడంతో సత్యదేవ్, నిత్యామీనన్ నటించిన క్రేజీ మూవీ స్కై ల్యాబ్ డిసెంబర్ 04 శనివారం రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 10న మడ్డీ మూవీతో పాటు కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు లీడ్ రోల్స్ లో షూటింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గుడ్ లక్ సఖి రిలీజ్ అవుతోంది.

Nayanthara: అటు రజని.. ఇటు ధనుష్.. మధ్యలో నయన్!

డిసెంబర్ 17న మాత్రం అసలు ఫీస్ట్ స్టార్టవ్వబోతోంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రష్మిక హీరోయిన్ దేవిశ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ తో తెరకెక్కుతున్న స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ పుష్ప రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా తెరకెక్కుతున్న పుష్ప ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న ధియేటర్లోకొస్తోంది. ఇక డిసెంబర్ 24న క్రిస్ మస్ సీజన్ లో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. డిసెంబర్ 24న వరుణ్ తేజ్ గని రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. అదే రోజు నాని, సాయిపల్లవి, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన రెబల్ మూవీ శ్యామ్ సింగరాయ్ రిలీజ్ అవుతోంది.