Addisons Disease : ఆడిసన్స్ వ్యాధితో బాధపడ్డ స్టార్ హీరోయిన్.. చిన్నప్పటి విషయాలు గుర్తు రావడం లేదట..

ఒకప్పుడు విశ్వసుందరి కిరీటం గెలుచుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి. ఆ తర్వాత ఆడిసన్స్ వ్యాధి బారిన పడి చాలా ఇబ్బందులు పడ్డారట. ఎవరా నటి?

Sushmita Sen : మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టి 1994 లో విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు సుస్మితా సేన్. 1996 లో ‘దస్తక్’ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుస్మిత ఆర్య 3 వెబ్ సిరీస్ తర్వాత అనారోగ్య కారణాలతో పెద్దగా యాక్టివ్‌గా  లేరు. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో సుస్మిత ఆరోగ్య పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులను షేర్ చేశారు.

Sushmita Sen 2

Genelia Deshmukh : జెనీలియా నిర్మాతగా.. రితీష్ డైరెక్ట్ చేస్తున్న రెండో సినిమా

బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు. 1994 లో మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్నాక వరుస పెట్టి బాలీవుడ్ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ నటి 2014 లో ఇమ్యూన్ డిసీజ్ ‘ఆడిసన్స్’ తో బాధపడినట్లు ఇటీవల ఇంటర్వ్యూలలో చెప్పారు. దాని కోసం క్రమం తప్పకుండా వాడిన స్టెరాయిడ్స్ తన శరీరంపై తీవ్ర ప్రభావం చూపించాయని వెల్లడించారు. 2023 లో గుండెపోటుకు గురైన సుస్మిత యాంజియో ప్లాస్టీ చేయించుకున్నారు. కఠోరమైన శ్రమతో తిరిగి తన ఆరోగ్యాన్ని పూర్వ స్థితికి తీసుకురాగలిగారు.

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

అడ్రినల్ గ్రంథులకు తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోవడమే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ‘ఆడిసన్స్’.  2014 లో దీని బారిన పడ్డ సుస్మిత ఎప్పుడూ నిరాశలో ఉండేవారట. 4 సంవత్సరాల పాటు చీకటి రోజులను చూసానని సుస్మిత గుర్తు చేసుకున్నారు. మొదడు మొద్దుబారిపోయిందని.. ఇప్పటికీ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకోలేకపోతున్నానని చెప్పారు. కార్టిసోల్ వంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడినట్లు సుస్మిత అన్నారు. తను మెరుగైన వైద్యం పొందగలిగే పరిస్థితులో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటానని ఈ స్టార్ హీరోయిన్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు