Genelia Deshmukh : జెనీలియా నిర్మాతగా.. రితీష్ డైరెక్ట్ చేస్తున్న రెండో సినిమా

ఛత్రపతి శివాజీ బయోపిక్ తెరపై ఆవిష్కరించబోతున్నారు బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్. జెనీలియా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదల చేసారు.

Genelia Deshmukh : జెనీలియా నిర్మాతగా.. రితీష్ డైరెక్ట్ చేస్తున్న రెండో సినిమా

Genelia Deshmukh

Updated On : February 20, 2024 / 1:12 PM IST

Genelia Deshmukh : 2022 లో  ‘వేద్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ తాజాగా ‘రాజా శివాజీ’ మూవీ డైరెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఈ మూవీకి రితీష్ భార్య నటి జెనీలియా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

Nainisha Roy : కమిట్ మెంట్ అడిగి ఇబ్బంది పెట్టారు.. రక్తం అమ్ముకుని కడుపు నింపుకోవాల్సి వచ్చింది.. నటి సంచలన వ్యాఖ్యలు

రితీష్ దేశ్‌ముఖ్ సోమవారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన బయోపిక్ ‘రాజా శివాజీ’ డైరెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. శివాజీ పాత్రలో రితీష్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రితీష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసారు. ‘ ఛత్రపతి శివాజీ కేవలం చరిత్రకు సంబంధించిన వ్యక్తి కాదు.. మూడున్నర శతాబ్దాలకు పైగా హృదయాలను ప్రకాశింపచేసిన ఒక భావావేశం.. సినిమా అనే గొప్ప కాన్వాస్‌పై ఆయన ప్రయాణాన్ని చిరస్థాయిగా నిలబెట్టాలనేది మా ప్రగాఢ ఆకాంక్ష. ఆయన భూమిని పాలించలేదు..ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.. ‘రాజా శివాజీ’ అనే మనోహరమైన బిరుదును సంపాదించాడు’ అంటూ రితీష్ ఈ సినిమాపై సుదీర్ఘ ట్వీట్ రాసుకొచ్చారు.

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రితీష్ భార్య నటి జెనీలియా‌తో పాటు జ్యోతి దేశ్ పాండే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. మరాఠీ,హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఛత్రపతి శివాజీ పాత్రలో రితీష్ దేశ్‌ముఖ్ నటిస్తున్నారు. రితీష్ గతంలో ‘వేద్’ అనే మరాఠీ సినిమా డైరెక్ట్ చేసారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ‘రాజా శివాజీ’ సినిమా ద్వారా రితీష్ మరోసారి తన దర్శకత్వ ప్రతిభకు పదును పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd)