Movie Shootings : ఏ హీరో సినిమా షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

ప్రజెంట్ సౌత్ లోని పెద్ద, చిన్న హీరోలందరూ తమ లేటెస్ట్ మూవీస్ షూటింగ్స్ కోసం వేరియస్ లొకేషన్స్ లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కోల్ కతా బ్యాక్ డ్రాప్ తో ఓ సెట్ వేశారు. ఇందులోనే.................

Movie Shootings : ఏ హీరో సినిమా షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

star heros movie shootings happening in different places

Updated On : February 14, 2023 / 10:53 AM IST

Movie Shootings :  ప్రజెంట్ సౌత్ లోని పెద్ద, చిన్న హీరోలందరూ తమ లేటెస్ట్ మూవీస్ షూటింగ్స్ కోసం వేరియస్ లొకేషన్స్ లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కోల్ కతా బ్యాక్ డ్రాప్ తో ఓ సెట్ వేశారు. ఇందులోనే 200 డాన్సర్లతో చిరంజీవిపై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. కీర్తిసురేష్ కూడా ఈ షూట్ లో పాల్గొంటోంది. ఇటీవలే ఈ సాంగ్ షూట్ లో రాఘవేంద్రరావు భోళా శంకర్ సెట్ కి వెళ్లి మెగాస్టార్ ని కలిశారు.

శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మొన్నటివరకు నానక్ రామ్ గూడలో షూట్ చేశారు. ఆ తర్వాత ఛార్మినార్ దగ్గర షూట్ చేశారు. ఇప్పుడు వైజాగ్ లో, కర్నూలులో షూట్ చేస్తున్నారు. ఇదంతా ఓ మాంటేజ్ సాంగ్ కోసం జరుగుతున్న షూట్.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప-2. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో బన్నీపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు.

మహేష్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తయింది. కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలోని జన్వాడ అనే గ్రామంలో భారీ ఇంటి సెట్ వేస్తున్నారు. విదేశాల్లో ఉన్న మహేష్ మరో 2 రోజుల్లో తిరిగొస్తున్నాడు. ఆ వెంటనే ఈ సెట్ లో షూట్ స్టార్ట్ అవుతుంది.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలోని మౌంట్ ఓపెరా దగ్గర జరుగుతోంది.

బాలకృష్ణ, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ హైదరాబాద్ మియాపూర్ లో జరుగుతోంది.

రవితేజ ‘రావణాసుర’ సినిమా షూటింగ్ హైదరాబాద్ సిటీ అవుట్స్ లో జరుగుతోంది.

రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో మూవీ ‘జైలర్’ మూవీ ప్రస్తుతం మంగళూర్ లో షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే రాజస్థాన్ లోని జైసల్మేర్ లో షూట్ కంప్లీట్ చేశారు.

Dhanush : చదువుకోలేదని బాధపడుతున్నా.. మీరు నాలాగా చేయకండి.. ధనుష్ వ్యాఖ్యలు..

ఇక దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబో మూవీ ‘లియో’ ప్రస్తుతం కశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ 15 రోజుల పాటు షూటింగ్ జరగబోతోంది. ఇటీవలే అక్కడి సెట్స్ నుంచి ఓ ఫోటోని పోస్ట్ చేశారు చిత్రయూనిట్.