Dhanush : చదువుకోలేదని బాధపడుతున్నా.. మీరు నాలాగా చేయకండి.. ధనుష్ వ్యాఖ్యలు..

ధనుష్ సినిమా గురించి మాట్లాడుతూ.. లాక్ డౌన్ లో ఈ స్టోరీని వెంకీ అట్లూరి చెప్పాడు. అసలు స్టోరీ వినే మూడ్ లో కూడా లేను అప్పుడు. విని చేయను అని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ సార్ సినిమా స్టోరీ విన్నాక కథలో చదువు గురించి ఉన్న సందేశం నాకు నచ్చి................

Dhanush : చదువుకోలేదని బాధపడుతున్నా.. మీరు నాలాగా చేయకండి.. ధనుష్ వ్యాఖ్యలు..

Dhanush comments on study importance in Sir Movie promotions

Updated On : February 14, 2023 / 10:01 AM IST

Dhanush :  ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ధనుష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ధనుష్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ధనుష్ గత సినిమా తిరు కూడా తెలుగులో మంచి విజయం సాధించింది. దీంతో సార్ సినిమా కూడా తెలుగులో మంచి హిట్ కొడుతుందని భావిస్తున్నాడు. దీంతో తెలుగులో కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు ధనుష్. తాజాగా ఇచ్చినా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి చెప్తూ అలాగే ప్రేక్షకులకి, ఫ్యాన్స్ కు ఓ విజ్ఞప్తి కూడా చేశాడు.

ధనుష్ సినిమా గురించి మాట్లాడుతూ.. లాక్ డౌన్ లో ఈ స్టోరీని వెంకీ అట్లూరి చెప్పాడు. అసలు స్టోరీ వినే మూడ్ లో కూడా లేను అప్పుడు. విని చేయను అని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ సార్ సినిమా స్టోరీ విన్నాక కథలో చదువు గురించి ఉన్న సందేశం నాకు నచ్చి డేట్స్ ఎప్పుడు కావాలని అడిగాను. సినిమాలో చదువుకు సంబంధించి మంచి సందేశం ఉంది. కామెడీ కూడా ఉంటుంది. అలాగే ఇది 90s లో జరిగే స్టోరీ. ఈ సినిమాని అందరూ కచ్చితంగా చూడాలి అని అన్నారు.

Samyuktha Menon : ఇంటిపేరు తీసేసిన హీరోయిన్.. సమంతతో పోలిస్తే సంతోషిస్తా..

అలాగే సార్ సినిమా చదువు గురించి కావడంతో చదువు ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. మమ్మల్ని చదివించడానికి మా పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో ఇప్పుడు నేను నా పిల్లల్ని చదివిస్తుంటే అర్ధమవుతుంది. నేను చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా అల్లరిగా తిరిగాను. ఓ అమ్మాయి వెనకాల పడ్డాను. పిచ్చి పనులు చేశాను. ఒకసారి మా టీచర్ నన్ను చూపించి చదువుకొని అందరూ బాగుపడతారు, నేను రోడ్ల మీద డ్యాన్సులు చేసుకుంటాను అని బాగా తిట్టింది. ఆమె అన్నట్టే ఇప్పుడు డ్యాన్సులు వేస్తున్నాను. అప్పుడప్పుడు నేను బాధపడతాను ఎందుకు సరిగ్గా చదువుకోలేదు, ఎందుకు స్కూల్, కాలేజీలకు సరిగ్గా వెళ్ళలేదు అని. ఆ విషయంలో నేను ఇప్పటికి బాధపడుతున్నాను. మీరు మాత్రం నాలాగా చేయకండి, సరిగ్గా చదువుకోండి అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.