స్టార్ వార్స్ నటుడు కన్నుమూత
స్టార్ వార్స్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు పీటర్ మెహ్యూ టెక్సాస్‌లోని సొంత ఇంట్లో తుదిశ్వాస విడిచాడు..

స్టార్ వార్స్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు పీటర్ మెహ్యూ టెక్సాస్‌లోని సొంత ఇంట్లో తుదిశ్వాస విడిచాడు..
స్టార్ వార్స్ సిరీస్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో వచ్చిన అన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్టార్ వార్స్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు పీటర్ మెహ్యూ ఇటీవల కన్నుమూసాడు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయనకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏప్రిల్ 30న టెక్సాస్‌లోని సొంత ఇంట్లో పీటర్ తుదిశ్వాస విడిచాడు. స్టార్ వార్స్‌లో చ్యూబాక్కా క్యారెక్టర్ ద్వారా పీటర్‌కి మంచి గుర్తింపు వచ్చింది. అసలు ఈ క్యారెక్టర్‌కి ఆయన సెలెక్ట్ అవడం వెనక చిన్న స్టోరీ ఒకటుంది.
స్టార్ వార్స్ క్రియేటర్ జార్జ్ లూకాస్ చ్యూబాక్కా క్యారెక్టర్‌కి పొడవుగా ఉండే వ్యక్తి కావాలని వెతుకుతూ, ఆరడుగుల ఆరంగుళాలున్న డేవిడ్ ప్రౌస్‌ని ఫిక్స్ చేసారు. కానీ, డేవిడ్.. డార్త్ వాడెర్ అనే క్యారెక్టర్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. మళ్ళీ ఆడిషన్స్ చేసి, ఏడడుగుల రెండంగుళాలున్న పీటర్‌ని చ్యూబాక్కా రోల్ కోసం తీసుకున్నాడు. చివరి వరకు ఆ క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న పీటర్ ముఖం సినిమాలో ఎక్కడా కనబడక పోయినా, అంతటి గుర్తింపు తెచ్చుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. పీటర్ మెహ్యూ మృతికి పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియచేసారు.