బ్లాక్ బస్టర్ ‘భీష్మ’- బన్నీ విషెస్..
యంగ్ హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రం చూసి మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..

యంగ్ హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రం చూసి మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..
యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీష్మ’. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌తో, హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. నితిన్ పెర్ఫార్మెన్స్, వెంకీ టేకింగ్‌కు మంచి అప్లాజ్ వస్తోంది.
సినిమా చూసి పలువురు సినీ ప్రముఖులు ‘భీష్మ’ టీమ్‌ను అభినందిస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘భీష్మ’ బృందానికి శుభాకాంక్షలు తెలుపారు. సినిమా చూసిన బన్నీ ‘‘Congratulations నితిన్.. ఇప్పుడు వెడ్డింగ్ Celebrations డబుల్ జోష్‌తో జరుగుతాయి.. Best thing Happened at the best time.. Really Happy for you. I Congratulate the entire Cast & Crew of Bheeshma..
See Also>> జయలలిత జయంతి – వైరల్ అవుతున్న‘తలైవి’ కొత్త లుక్..
దర్శకుడు వెంకీ సినిమాను కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా తీర్చిదిద్దారు. రష్మిక ఆల్ రౌండర్ అనిపించుకుంది. మా ప్రొడ్యూసర్ వంశీ 2020 జనవరి, ఫిబ్రవరిలో వరస సక్సెస్‌లు కొట్టారు.. అందరికీ అభినందనలు’’.. అంటూ ట్వీట్ చేశారు. ఇటీవలే నితిన్ నిశ్చితార్థం షాలినీతో జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో వివాహం జరుగనుంది.
Double Congratulations @actor_nithiin . Now the wedding celebrations will happen with double josh. Best thing happened at the best time . Really happy for you . I Congratulate the entire Cast & Crew of #Bheeshma .
— Allu Arjun (@alluarjun) February 24, 2020
Congratulations to the Dir Venky Garu for the Commercial Emotional Entertainer , @iamRashmika for being an all rounder & my Producer Vamsi for the Raining success , 2020 Jan & Feb have been great for you . Congratulations to everyone once again .
— Allu Arjun (@alluarjun) February 24, 2020
Read More>>నితిన్ ‘అంథాధూన్’ రీమేక్ ప్రారంభం..