సైరాకు శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.. టీమ్‌కు శుభాకాంక్షలు తెలియచేసిన అల్లు అర్జున్..
మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.. టీమ్‌కు శుభాకాంక్షలు తెలియచేసిన అల్లు అర్జున్..
తొలితరం స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గాంధీ జయంతి సందర్భంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజవుతోంది. రీసెంట్గా సైరా సినిమా గురించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించాడు.
ఇటీవల జరిగిన సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాహీరోలంతా వచ్చారు. బన్నీ ఎక్కడా కనబడలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా రెస్పాండ్ అవుతాడేమోనని మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. రీసెంట్గా సైరా సినిమా గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
Read Also : రాణీ ముఖర్జీ ‘మర్దానీ 2’ – ఫస్ట్‌లుక్..
‘సైరా తెలుగు చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే సినిమా.. మగధీర చూసినప్పుడు చిరంజీవి కూడా అలాంటి సినిమా చేస్తే చూడాలనుకున్నాను.. ఇప్పటికి నా కోరిక తీరింది.. చిరంజీవితో ఇలాంటి చారిత్రాత్మక చిత్రం తీసినందుకు నా బావ రామ్ చరణ్‌కు అభినందనలు.. ఒక తండ్రికి కొడుకు ఇచ్చే గొప్ప బహుమతి ఈ సినిమా.. దర్శకుడు సురేందర్ రెడ్డిపై గౌరవం మరింత పెరిగింది.. మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’ అంటూ బన్నీ సైరా టీమ్‌కు శుభాకాంక్షలు తెలియచేశాడు..