Sudha Kongara : చెయ్యి విరగ్గొట్టుకున్న స్టార్ డైరెక్టర్.. కొని నెలలు ఇంట్లోనే రెస్ట్ మోడ్..

తాజాగా సినీ డైరెక్టర్ సుధాకొంగరకు ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరగగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చేతికి పెద్ద దెబ్బ తగిలింది. దీంతో చేతికి ఆపరేషన్ చేసి కట్టు వేసినట్టు తెలుస్తుంది. కట్టు వేసిన తన చేతి ఫోటోలని సుధా కొంగర సోషల్ మీడియాలో షేర్ చేసి...............

Sudha Kongara : చెయ్యి విరగ్గొట్టుకున్న స్టార్ డైరెక్టర్.. కొని నెలలు ఇంట్లోనే రెస్ట్ మోడ్..

sudha kongara hand broke in accident happened while movie shoot

Updated On : February 5, 2023 / 4:32 PM IST

Sudha Kongara :  గురు, ఆకాశం నీ హద్దురా లాంటి సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి, అవార్డులు సాధించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగింది సుధా కొంగర. ప్రస్తుతం సుధా కొంగర ఆకాశం నీ హద్దురా సినిమాని బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

అయితే తాజాగా సినీ డైరెక్టర్ సుధాకొంగరకు ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరగగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చేతికి పెద్ద దెబ్బ తగిలింది. దీంతో చేతికి ఆపరేషన్ చేసి కట్టు వేసినట్టు తెలుస్తుంది. కట్టు వేసిన తన చేతి ఫోటోలని సుధా కొంగర సోషల్ మీడియాలో షేర్ చేసి.. చాలా నొప్పిగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. దీనివల్ల నెల రోజుల పాటు రెస్ట్ అని పోస్ట్ చేసింది.

Vijay Devarakonda : మొత్తానికి బయటకొచ్చిన రౌడీ స్టార్.. ఆగిపోయిన ఖుషి పనులు మొదలు..

సుధా కొంగర రెస్ట్ మోడ్ లోకి వెళ్లడంతో అక్షయ్ కుమార్ తో తెరకెక్కిస్తున్న ఆకాశం నీ హద్దురా సినిమా రీమేక్ షూటింగ్ కి బ్రేక్ పడింది. మళ్ళీ సుధా కోలుకున్న తర్వాతే ఈ సినిమా షూట్ మొదలవుతుందని సమాచారం. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కోరుకుంటున్నారు.