Sudheer Babu: హంట్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

టాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే హీరోగా సుధీర్ బాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆయన నటించే సినిమాలు మినిమం గ్యారెంటీ హిట్లుగా నిలుస్తుండటంతో ఆయన సినిమాలకు ప్రేక్షకాదరణ ఖచ్చితంగా ఉంటుంది. ఇక సుధీర్ బాబు ప్రస్తుతం ఓ కాప్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

Sudheer Babu: హంట్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

Sudheer Babu Hunt Movie Pre-Release Event To Be Held At This Time

Updated On : January 22, 2023 / 1:57 PM IST

Sudheer Babu: టాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే హీరోగా సుధీర్ బాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆయన నటించే సినిమాలు మినిమం గ్యారెంటీ హిట్లుగా నిలుస్తుండటంతో ఆయన సినిమాలకు ప్రేక్షకాదరణ ఖచ్చితంగా ఉంటుంది. ఇక సుధీర్ బాబు ప్రస్తుతం ఓ కాప్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

Sudheer Babu: సెన్సార్ పనులు ముగించుకున్న సుధీర్ బాబు ‘హంట్’

హంట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన సినిమాలో సుధీర్ బాబు ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయనతో పాటు తమిళ నటుడు భరత్, శ్రీకాంత్‌లు కూడా కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Sudheer Babu : ఇంట్లో వాళ్ళు వద్దన్నారు.. కానీ కృష్ణ గారే..

ఆదివారం రోజున ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని ముందుగా ప్లాన్ చేసినా, కొన్ని కారణాల వల్ల ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకను సోమవారం నాటికి మార్చారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు హంట్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను AMB సినిమాస్‌లోని 6వ స్క్రీన్‌లో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక జనవరి 26న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.