Sudheer Babu: సెన్సార్ పనులు ముగించుకున్న సుధీర్ బాబు ‘హంట్’

యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌తోనే ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ పలుమార్లు వెల్లడించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

Sudheer Babu: సెన్సార్ పనులు ముగించుకున్న సుధీర్ బాబు ‘హంట్’

Sudheer Babu Hunt Movie Completes Censor Work

Sudheer Babu: యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌తోనే ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ పలుమార్లు వెల్లడించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

Sudheer Babu: సుధీర్ బాబు ‘హంట్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

కాగా, ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాలోని యాక్షన్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారట.

Sudheer Babu : ఇంట్లో వాళ్ళు వద్దన్నారు.. కానీ కృష్ణ గారే..

ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ సరికొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాతో సుధీర్ బాబు మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, మిమీ గోపీ, కబీర్ దుహాన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మహేష్ డైరెక్ట్ చేస్తుండగా, భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.