From Maama Mascheendra To Be Out Tomorrow
Sudheer Babu: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఎంచుకునే పాత్రలు ఆయనకు మంచి పేరును తీసుకొస్తాయని అభిమానులు అంటుంటారు. ఇక ఆయన చేసే సినిమాలు హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండాలని ఆయన చూస్తుంటాడు. ఈ క్రమంలోనే వరుసబెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాడు ఈ హీరో.
Sudheer Babu : సుధీర్ బాబు కెరీర్‌లో మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నాడా?
ఇక తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న ‘మామా మశ్చీంద్ర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సుధీర్ బాబు ఏకంగా ట్రిపుల్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రల్లో నటిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాత్రగా ‘దుర్గ’ అనే క్యారెక్టర్‌ను ఇటీవల ఇంట్రొడ్యూస్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాత్రలో సుధీర్ బాబు ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా లావుగా కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.
Sudheer Babu : కొత్త సినిమాలో సుధీర్ బాబు లుక్ చూస్తే షాక్ అవుతారు.. వీడియో లీక్!
కాగా, తాజాగా ఈ సినిమాలోని రెండో పాత్రగా పరశురామ్ అనే క్యారెక్టర్‌ను రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలోని పరశురామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు ఉదయం 11.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాను నటుడు కమ్ డైరెక్టర్ హర్షవర్ధన్ తెరకెక్కిస్తుండగా ఈషా రెబ్బా, మిర్నాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
A Rugged Avatar with Swag!
Unveiling the Second Look of @isudheerbabu as #Parasuram TOMORROW @ 11:05 AM ? #SBasParasuram ✅#MaamaMascheendra @HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @pgvinda @AsianSuniel @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/m51GULn9X7
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) March 3, 2023