కథ, దర్శకత్వం సుకుమార్ : బందిపోటు పాత్రలో బన్నీ

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 06:35 AM IST
కథ, దర్శకత్వం సుకుమార్ : బందిపోటు పాత్రలో బన్నీ

Updated On : April 3, 2019 / 6:35 AM IST

రంగస్థలంలో రామ్ చరణ్ ని రఫ్ లుక్ లో చూపించి రప్ఫాడించిన డైరెక్టర్ సుకుమార్.. ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రయోగం చేయబోతున్నాడు. బన్నీని మరోసారి బందిపోటు దొంగలా మార్చేందుకు ట్రై చేస్తున్నాడు.. ఈ క్రేజీ డైరెక్టర్. అయితే ముచ్చటగా మూడోసారి హిట్టు కొట్టేందుకు..ఇద్దరూ గట్టి ప్లానే వేశారు. రంగస్థలం తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి సుకుమార్ స్టోరీ రెడీ చేసుకున్నాడు. కానీ ఫైనల్ స్క్రిప్టు విషయంలో సుకుమార్ – మహేష్ మధ్య డిఫరెన్సెస్ రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో సుకుమార్, అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు.

ఇక బన్నీ, సుకుమార్ సినిమాకి సంబంధించి.. ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ హల్ చల్ చేస్తోంది. శేషాచలం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ కథ తిరగనుందని సమాచారం. అంతేకాదు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ని కలిసి రీసెర్చ్ చేసి మరీ సుకుమార్ స్టోరీ రెడీ చేశాడు. సినిమాలో ఎర్ర చందనం స్మర్గర్ల పనిపట్టే అడవిదొంగ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు.

2015లో గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన రుద్రమదేవి సినిమాలో.. అల్లు అర్జున్ బందిపోటు దొంగ గోన గన్నారెడ్డి పాత్రలో అదరగొట్టాడు. రుద్రమదేవిలో లీడ్ రోల్ చేసిన అనుష్క క్యారెక్టర్ కన్నా బన్నీ పాత్రకే ఆడియన్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈసారి.. దొంగ పాత్రలో బన్నీ ఏ రేంజ్ లో అదరగొడతాడో చూడాలి. అందులోనూ.. సుకుమార్ దర్శకత్వం కావడంతో ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఇంకాస్త పెరిగిపోయాయి. త్రివిక్రమ్ సినిమా పూర్తికాగానే బన్నీ, సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఏది ఏమైనా సుకుమార్ మళ్ళీ మెగా ఫ్యామిలీ హీరోతోనే సినిమా చేయబోతున్నాడు అన్నమాట.