Sundeep Kishan : ప్రభాస్ ప్రాజెక్ట్ K.. సందీప్ కిషన్ ప్రాజెక్ట్ Z.. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్..

తమిళ్ లో థ్రిల్లింగ్ సినిమాలు తీసే డైరెక్టర్ CV కుమార్ 2017 లో సందీప్ కిషన్ హీరోగా మాయావన్ అనే సినిమాని తీశారు. ఈ సినిమాని తెలుగులో ప్రాజెక్ట్ Z గా రిలీజ్ చేశారు.

Sundeep Kishan : ప్రభాస్ ప్రాజెక్ట్ K.. సందీప్ కిషన్ ప్రాజెక్ట్ Z.. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్..

Sundeep Kishan Announced Project Z Maayavan Movie Sequel with same Director CV Kumar

Updated On : September 26, 2023 / 7:05 AM IST

Sundeep Kishan : ఇటీవల కొత్త కొత్త కథలతో చాలా సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సినిమాలు చాలా వస్తున్నాయి. ప్రభాస్ ప్రాజెక్ట్ K అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసందే. ఇది కూడా సైన్స్, ఫ్యూచర్ మీదే రాబోతుంది. అయితే దీనికి కల్కి 2898AD అనే టైటిల్ మార్చేశారు. ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమా ఇప్పుడు అనౌన్స్ చేశారు కానీ సందీప్ కిషన్ 2017 లోనే ప్రాజెక్ట్ Z అనే సినిమాని తీశారు.

తమిళ్ లో థ్రిల్లింగ్ సినిమాలు తీసే డైరెక్టర్ CV కుమార్ 2017 లో సందీప్ కిషన్ హీరోగా మాయావన్ అనే సినిమాని తీశారు. ఈ సినిమాని తెలుగులో ప్రాజెక్ట్ Z గా రిలీజ్ చేశారు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. కమర్షియల్ గా అంత సక్సెస్ అవ్వకపోయినా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా జాకీ ష్రాఫ్, పలువురు తమిళ్ నటులు ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా మాయావన్ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు. అదే దర్శకుడు CV కుమార్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా అనిల్ సుంకర నిర్మాతగా AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రాజెక్ట్ Z సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. నిన్నే పూజా కార్యక్రమాలు కూడా జరిగి అధికారికంగా సినిమాని ప్రకటించారు. మరి ఈ సీక్వెల్ కి ఏం పేరు పెడతారో చూడాలి. మాయావన్ సీక్వెల్ లో హీరోయిన్ ని ఇంకా ప్రకటించలేదు. ప్రభాస్ ప్రాజెక్ట్ K టైటిల్ కి మంచి రీచ్ వచ్చింది కాబట్టి గత సినిమా ప్రాజెక్ట్ Z కాబట్టి అదే టైటిల్ ఉంచుతారా, మారుస్తారా చూడాలి మరి.

Sundeep Kishan Announced Project Z Maayavan Movie Sequel with same Director CV Kumar

Also Read : Mahesh Babu : అబ్బ.. మహేష్ బాబు కొత్త లుక్ అదిరిపోయిందిగా.. యాడ్ షూట్ కోసం..

ఈ సినిమా ఓపెనింగ్ ఫోటోలు సందీప్ కిషన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి నాకిష్టమైన సినిమాకి సీక్వెల్ తీస్తున్నాను అదే టీంతో అని ప్రకటించాడు.