Sundeep Kishan: ‘ఊరుపేరు’తో భయపెడుతున్న హీరో.. ‘భైరవకోన’ రహస్యం ఏమిటో?
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను వరుసగా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మైఖేల్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ఈ హీరో....

Sundeep Kishan Ooru Peru Bhairavakona Motion Poster Released
Sundeep Kishan: యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను వరుసగా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మైఖేల్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ఈ హీరో, టాలీవుడ్ విలక్షణ దర్శకుడు విఐ ఆనంద్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే జరుగుతుండటంతో ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర యూనిట్. హీరో సందీప్ కిషన్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను చిత్ర యనిట్ రిలీజ్ చేసింది.
Sundeep Kishan: మైఖేల్ లుక్‌లో అదరగొట్టిన సందీప్ కిషన్!
ఈ సినిమాకు ‘ఊరుపేరు భైరవకోన’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగా, ఈ సినిమా ఆద్యంతం హార్రర్ అంశాలతో ప్రేక్షకులను కట్టిపడేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంట్లో షూటింగ్‌కు సంబంధించిన పలు చిత్రీకరణ సన్నివేశాలు మనకు కనిపించాయి. హీరోయిన్లు కావ్య థాపర్, వర్షా బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా, విఐ ఆనంద్ తనదైన మార్క్ హార్రర్, సస్పెన్స్ అంశాలతో ఈ సినిమాను థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.
Sundeep Kishan : సందీప్‌కిషన్ పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్
మొత్తంగా చూస్తే ఈ సినిమాతో సందీప్ కిషన్ మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవడం ఖయంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అనిల్ సుంకర్ ప్రెజెంట్ చేస్తున్నారు. మరి ఈ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.