Ooru Peru Bhairavakona : సినిమా రిలీజ్ కాకుండానే.. కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్..
సినిమా రిలీజ్ కాకుండానే సందీప్ కిషన్ ‘ఊరి పేరు భైరవకోన’ కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి వావ్ అనిపిస్తుంది.

Sundeep Kishan Ooru Peru Bhairavakona paid premier collections report
Ooru Peru Bhairavakona : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. గత కొంతకాలంగా సరైన హిట్టు లేక ఇబ్బందులు పడుతున్నారు. చివరిగా ‘మైఖేల్’ అనే పాన్ ఇండియా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినా పెద్దగా వర్క్ అవుట్ లేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ధ్యేయంతో.. ఓ థ్రిల్లింగ్ జోనర్ తో ‘ఊరి పేరు భైరవకోన’ అనే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. డిఫరెంట్ జోనర్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేసే వీఐ ఆనంద్.. ఈ సినిమాని డైరెక్ట్ చేశారు.
సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం.. ఈ శుక్రవారం ఫిబ్రవరి 16న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అండ్ టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడంతో మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అంతేకాకుండా ఇటీవల ఇలాంటి జోనర్స్ లో వచ్చిన కొన్ని సినిమాలు టాలీవుడ్ ఆడియన్స్ ని బాగా థ్రిల్ చేయడంతో.. మూవీ రిలీజ్ పై మంచి బజ్ నెలకుంది. దీంతో ఈ మూవీ రిలీజ్ కి ముందే.. కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి మేకర్స్ ని ఖుషి చేస్తుంది.
Also read : Prabhas : నిర్మాతల పాలిట దేవుడు ప్రభాస్.. ఎందుకంటే?
రిలీజ్ కి ముందే కలెక్షన్స్ ఏంటని అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే.. ఈ మూవీని పెయిడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ కి రెండు రోజులు ముందుగానే థియేటర్స్ లోకి తీసుకు వచ్చేసారు. నిన్న బుధవారం రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సిటీస్ లో ఈ పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. ఈరోజు గురువారం కూడా పెయిడ్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇక ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో మూవీ పై మరింత హైప్ క్రియేట్ అవుతుంది.
కాగా ఈ రెండు రోజుల ప్రీమియర్స్ కలెక్షన్స్.. దాదాపు రూ.1.1 కోటికి పైగా కలెక్షన్స్ ని రాబట్టిందట. ఇక ఈ ప్రీమియర్ కలెక్షన్స్ తోనే సందీప్ తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ ని అందుకున్నట్లు తెలుస్తుంది. మరి రేపు మంచి బజ్ తో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం.. ఇంకెంతటి కలెక్షన్స్ ని నమోదు చేస్తుందో చూడాలి.