Prabhas : నిర్మాతల పాలిట దేవుడు ప్రభాస్.. ఎందుకంటే?

ప్రభాస్‌తో సినిమా చేసిన నిర్మాతలు తనని ఎంతగానో అభిమానిస్తారు. నిర్మాతల కష్టం తెలిసిన వ్యక్తి అని అంటారు. వారి అభిమానానికి కారణం ఏంటి?

Prabhas : నిర్మాతల పాలిట దేవుడు ప్రభాస్.. ఎందుకంటే?

Prabhas

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి సినీ ఇండస్ట్రీలో హీరోగానే కాదు.. మంచి వ్యక్తిత్వం ఉన్న హీరోగా పేరుంది. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలు చేసిన నిర్మాతలు తనని ఎంతగానో అభిమానిస్తారు. ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడూ వారిని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీలో ప్రభాస్ సినిమాలు చేసిన ఏ నిర్మాతను అడిగిన ఇదే విషయం నొక్కి చెబుతారు.

Sundaram Master Trailer : సుందరం మాస్టర్ ట్రైలర్ చూశారా? కామెడీ అనుకున్నాం కానీ.. సీరియస్ సినిమానే..

ఒక పెద్ద హీరో సినిమా అంటే  అతనికి ఇచ్చే రెమ్యునరేషన్‌తో పాటు అతనికి సంబంధించిన ప్రతి విషయంలో నిర్మాతలు ఖర్చులు భరిస్తుంటారు. అయితే ప్రభాస్ విషయంలో అలా కాదు.. ఒకసారి రెమ్యునరేషన్ తీసుకున్నాక ప్రభాస్ నిర్మాతల నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోరట. ఆయనకు సంబంధించిన అన్ని పనుల్లో తానే సొంతంగా ఖర్చు పెట్టుకుంటారట. ప్రభాస్ తన కారులోనే వస్తారట. ఆయన కారవాన్ వస్తుందట.. అసిస్టెంట్స్, మేకప్ మేన్‌ల జీతాల దగ్గర్నుంచి ఆయన కూర్చునే టెంట్ వరకు అన్నీ ఆయనదే వస్తుందట. ఇక ఫుడ్ కూడా ఇంటి నుండే వస్తుందట.. అదీ 25 మంది తినేంతలా పంపిస్తారట. ప్రభాస్ వెంట ఉండే బాడీ డబుల్స్, బౌన్సర్లకు కూడా ప్రభాస్ చెల్లిస్తారట. వీటన్నిటికీ  చాలానే ఖర్చవుతుంది. ఆ ఖర్చుల భారాన్ని నిర్మాతపై వేయకుండా ప్రభాస్ తానే చూసుకుంటారట. మరీ ఇంత మంచితనం ఉన్న వ్యక్తిని నిర్మాతల పాలిట దేవుడనేగా చెప్పాలి. నిర్మాతల కష్టం తెలిసిన వ్యక్తిగా ప్రభాస్‌ను అందుకే అనేకమంది నిర్మాతలు అభిమానిస్తారట.

Allu Arjun : బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి బయలుదేరిన బన్నీ.. పుష్ప స్క్రీనింగ్..?

ఇక ప్రభాస్ వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత సలార్ సక్సెస్ ఇచ్చిన కిక్‌తో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. నాగ్ అశ్విన్ సినిమా కల్కి 2898 AD, మారుతి ది రాజా సాబ్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి.