Sundaram Master Trailer : సుందరం మాస్టర్ ట్రైలర్ చూశారా? కామెడీ అనుకున్నాం కానీ.. సీరియస్ సినిమానే..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సుందరం మాస్టర్ ట్రైలర్ రిలీజ్ చేసారు.

Sundaram Master Trailer : సుందరం మాస్టర్ ట్రైలర్ చూశారా? కామెడీ అనుకున్నాం కానీ.. సీరియస్ సినిమానే..

Viva Harsha Sundaram Master Trailer Released by Megastar Chiranjeevi

Updated On : February 15, 2024 / 4:20 PM IST

Sundaram Master Trailer : కమెడియన్ వైవా హర్ష (Viva Harsha) మెయిన్ లీడ్ లో ‘సుందరం మాస్టర్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మాస్ మహారాజ్ రవితేజ RT టీం వర్క్స్, గోల్‌డెన్ మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సుందరం మాస్టర్ ట్రైలర్ రిలీజ్ చేసారు.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. వైవా హర్షని ఒక గూడెంలోకి ఇంగ్లీష్ నేర్పించమని పంపిస్తారు. ఆల్రెడీ అక్కడ అందరికి వైవా హర్ష కంటే బాగా ఇంగ్లీష్ వచ్చు. కానీ తనని ఆ ఊరికి పంపించింది ఇంగ్లీష్ నేర్పడం కోసం కాదని, అక్కడ ఉన్న విలువైనది ఏదో కనిపెట్టడం కోసం అని తర్వాత తెలుస్తుంది. సినిమా మొదటి హాఫ్ కామెడీగా, ఆ తర్వాత సీరియస్ గా ఉండబోతుందని ట్రైలర్ తో తెలుస్తుంది. సుందరం మాస్టర్ సినిమా ఫిబ్రవరి 23 రిలీజ్ కాబోతుంది.