కొత్త వ్యాపారంలోకి ఎంటర్ అయిన సందీప్ కిషన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్..
హీరోగా, నిర్మాతగా ఈ ఏడాది విజయాలు అందుకున్నాడు యువ నటుడు సందీప్ కిషన్. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’ నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన ఆ చిత్రం, కథానాయకుడిగా సందీప్ కిషన్‌కు మంచి విజయం అందించింది. అలాగే, ‘తెనాలి రామకృష్ణ’తో కమర్షియల్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు సందీప్ కిషన్. ఈ సంతోష సమయంలో తల్లిదండ్రులకు బెంజ్ జిఎల్ఈ 350డి కారును సందీప్ బహుమతిగా ఇవ్వడం విశేషం.
సందీప్ కిషన్ నటుడు, నిర్మాత మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా! జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ‘వివాహ భోజనంబు’ పేరుతో ఆయనకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి. విజయవంతంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఆయన, కొత్తగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఆయన ఒక సెలూన్ ప్రారంభించనున్నారు.
స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ (హెయిర్ అండ్ బ్యూటీ- యునిసెక్స్ సెలూన్) ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నారు. త్వరలో ఆ సెలూన్ ప్రారంభం కానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే… హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా చేస్తున్నాడు.