‘వేదాంతం రాఘ‌వ‌య్య‌’ గా సునీల్..

  • Published By: sekhar ,Published On : August 31, 2020 / 02:00 PM IST
‘వేదాంతం రాఘ‌వ‌య్య‌’ గా సునీల్..

Updated On : August 31, 2020 / 3:49 PM IST

Sunil as Vedantham Raghavaiah: క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్ ‘అరవింద సమేత’ నుంచి మళ్లీ క‌మెడియ‌న్‌గా న‌టిస్తున్నారు. అయితే త్వ‌ర‌లోనే హీరోగా వెండితెర‌పై సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. తాజాగా సునీల్ టైటిల్ పాత్ర‌లో నటించనున్న ‘వేదాంతం రాఘ‌వ‌య్య‌’ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.



ప్ర‌ముఖ దర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్.ఎస్ ఈ చిత్రానికి కథనందించడంతో పాటు స‌మ‌ర్ప‌కులుగానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్ ఈ బ్యానర్లోనే ‘గద్దలకొండ గణేష్’ వంటి సూపర్ హిట్ చిత్రం చేశారు.
https://10tv.in/naga-chaitanyas-20th-movie-thankyou-announced/

త్వ‌ర‌లోనే ‘వేదాంతం రాఘ‌వ‌య్య‌’ సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, ద‌ర్శ‌కుడు స‌హా ఇత‌ర‌ సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.