Sunny Deol : టాలీవుడ్ డైరెక్టర్.. బాలీవుడ్ హీరో.. సన్నీడియోల్ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్.. ఫ్యాన్‌తో ఫైట్..
తాజాగా నేడు సన్నీ డియోల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Sunny Deol Gopichand Malineni Movie Title and First Look Released
Sunny Deol : మన టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా ఇటీవల ఓ పాన్ ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాని హిందీలో తెరకెక్కించి అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
Also Read : Mahesh – Sitara : బ్యాంకాక్‌లో మహేష్ ఫ్యామిలీ వెకేషన్.. కూతురు సితారతో మహేష్..
తాజాగా నేడు సన్నీ డియోల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు జాట్ అనే టైటిల్ ని ప్రకటించారు. ఫస్ట్ లుక్ లో సన్నీ డియోల్ ఓ పెద్ద ఫ్యాన్ ని పట్టుకొని యాక్షన్ సీక్వెన్స్ కి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇటీవలే సన్నీడియోల్ గదర్ 2 సినిమాతో భారీ విజయం సాధించాడు. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఈ సినిమా రాబోతున్నట్టు సమాచారం. మంచి మాస్ యాక్షన్ సినిమాలా ఉంటుందని మూవీ యూనిట్ ఈ సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కి బాలయ్య బాబు వెళ్లి సన్నీ డియోల్ ని కలిసొచ్చారు.
Introducing the man with a national permit for MASSIVE ACTION 💥💥@iamsunnydeol in and as #JAAT ❤️🔥#SDGM is #JAAT 🔥
Happy Birthday Action Superstar ✨
MASS FEAST LOADING.
Directed by @megopichand
Produced by @MythriOfficial & @peoplemediafcy #HappyBirthdaySunnyDeol… pic.twitter.com/zbGDsZgMjq— Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2024