Sunny Leone : సన్నీలియోన్ తెలుగు ఇస్కూల్.. అదిరిపోయిన ప్రోమో.. దేశ విదేశాల నుంచి తెలుగు కోసం..

ఇప్పుడు తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది సన్నీలియోన్. యాంకర్ రవి(Anchor Ravi), డ్యాన్సర్ పండుతో కలిసి సన్నీలియోన్ తెలుగు మీడియం ఇస్కూల్(Telugu Medium I school) అనే షోతో జీ తెలుగులో హంగామా చేయనుంది.

Sunny Leone : సన్నీలియోన్ తెలుగు ఇస్కూల్.. అదిరిపోయిన ప్రోమో.. దేశ విదేశాల నుంచి తెలుగు కోసం..

Sunny Leone New Show Telugu Medium I School Show Promo Released Full Entertaining Promo

Sunny Leone : అడల్ట్ సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీకి వచ్చిన సన్నీ లియోన్.. నార్త్ టు సౌత్ పలు భాషల్లో నటిస్తూ బిజీ అయిపొయింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోలు, టీవీ షోల్లో కనిపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది. ఇక ఈ భామ తెలుగులో మంచు మనోజ్ ‘కరెంటు తీగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఒక స్పెషల్ సాంగ్, ఓ సినిమాలో నటించింది.

ఇప్పుడు తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది సన్నీలియోన్. యాంకర్ రవి(Anchor Ravi), డ్యాన్సర్ పండుతో కలిసి సన్నీలియోన్ తెలుగు మీడియం ఇస్కూల్(Telugu Medium I school) అనే షోతో జీ తెలుగులో హంగామా చేయనుంది. తాజాగా ఈ షో నుంచి ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం ఫుల్ కామెడీగా సాగింది. మన తెలుగు కమెడియన్స్ తో పాటు వేరే దేశాల నుంచి పలువురు లోకల్ ప్రముఖుల్ని తీసుకొచ్చారు.

Also Read : Prabhas : ప్రభాస్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన మారుతి.. వచ్చే నెల నుంచి..

వారికి తెలుగు నేర్పిస్తూ, తెలుగులో వారు మాట్లాడటం, పాడటం, తెలుగు పాటలకు డ్యాన్స్ చేయడం.. వంటివి చూపించారు ఈ ప్రోమోలో. ఇక ఈ షోలో మన తెలుగు కమెడియన్స్ ని, వేరే దేశాల వాళ్ళని జంటలుగా చేసి సరికొత్తగా షో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సన్నీలియోన్ ఈ షోకి జడ్జిగా వ్యవహరించబోతుంది. తాజాగా రిలిజ్ అయిన ప్రోమో వైరల్ అవ్వగా దీంతో ఈ షోపై అంచనాలు నెలకొన్నాయి. ఈ తెలుగు మీడియం ఇస్కూల్ షో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో రానుంది. నేడు ఆదివారం అక్టోబర్ 8 నుంచే షో మొదలవ్వనుంది.