Sunny Leone : తెలుగు సినిమాలో సన్నీ లియోన్ ఐటెం సాంగ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?
తాజాగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ రిలీజ్ చేసారు. (Sunny Leone)
Sunny Leone
Sunny Leone : సన్నీలియోన్ మెయిన్ లీడ్ లో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాణంలో రజేశ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘త్రిముఖ’. యోగేష్ కల్లే, అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, ప్రవీణ్, షకలక శంకర్, ఆషు రెడ్డి, సుమన్, రవి ప్రకాష్, సాహితి, సూర్య, జీవా, జెమిని సురేష్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.(Sunny Leone)
త్రిముఖ సినిమాని హిందీ, తెలుగు భాషల్లో బైలింగ్వల్ గా తెరకెక్కిస్తుండగా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ రిలీజ్ చేసారు. గిప్పా గిప్పా.. అంటూ సాగిన ఈ పాటను వినోద్ యాజమాన్య సంగీత దర్శకంలో గణేష్ రాయగా సాహితీ చాగంటి పాడింది.
ఈ పాటలో సన్నిలియోన్ తో పాటు సాహితి దాసరి, ఆకృతి అగర్వాల్ లు కూడా స్టెప్పులేశారు. త్రిముఖ సినిమా 2026 జనవరి 2న విడుదల కానుంది. మీరు కూడా ఈ ఐటెం సాంగ్ వినేయండి..
