మహేష్ బాబు ట్వీట్ -ఎన్టీఆర్ కథానాయకుడు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూసి, ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

  • Published By: sekhar ,Published On : January 10, 2019 / 05:50 AM IST
మహేష్ బాబు ట్వీట్ -ఎన్టీఆర్ కథానాయకుడు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూసి, ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం ఎన్టీఆర్ కథానాయకుడు నిన్న (జనవరి9) గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. యూఎస్ ఆడియన్స్‌తో పాటు, మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా బాగుంది. స్వర్గీయ ఎన్టీరామారావు బయోపిక్ కావడంతో, సామాన్యులే కాకుండా సినీ పరిశ్రమ వాళ్ళుకూడా ఈ సినిమాపై ఆసక్తితో ఉదయాన్నే షోలకు వెళ్ళారు. చాలామంది సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా  కథానాయకుడు మూవీ యూనిట్‌ని ప్రశంసించారు. తెరపై చూసేటప్పుడు బాలయ్య కనిపించలేదు, అన్నగారే కనబడ్డారు. బాలయ్య అంతలా మెప్పించాడు, తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి రుణం తీర్చుకున్నాడు, ఎన్టీఆర్‌‌కిది నిజమైన నివాళి అంటూ నిన్న ట్విట్టర్ అంతా సందడి సందడి చేసారు.

ఇదిలా ఉంటే, రీసెంట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూసి, ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. డైరెక్టర్ క్రిష్ కథానాయకుడు సినిమాని చాలా పెద్ద కాన్వాస్‌పై అత్యంత అద్భుతంగా తెరకెక్కించారు. బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్‌లో జీవించేసారు. ప్రతీ బిట్‌లోనూ చాలా బాగా నటించారు. మిగతా క్యారెక్టర్స్‌లో అందరూ చక్కగా నటించారు అని ఎన్టీఆర్ కథానాయకుడు యూనిట్‌ని అభినందించాడు సూపర్ స్టార్.