Rajinikanth : రజినీకాంత్ రిటైర్మెంట్.. ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వబోతున్న తలైవా..?
త్వరలో తలైవా షూటింగ్‌లకు ప్యాకప్ చెప్తారన్న గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. (Rajinikanth)
Rajinikanth
Rajinikanth : సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తారనే చర్చ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో తలైవా షూటింగ్‌లకు ప్యాకప్ చెప్తారన్న గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. జైలర్ ఫస్ట్ పార్ట్ విజయవంతమైన తర్వాత ఆడియన్స్ డిమాండ్ మేరకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.
జైలర్ సీక్వెల్ పూర్తయిన తర్వాత, నెల్సన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ రిటైర్మెంట్పై వైరల్ అవుతున్న రూమర్స్ ఫ్యాన్స్‌ను షాకింగ్ చేస్తున్నాయి. నెల్సన్ దర్శకత్వంలో కమల్ హాసన్‌తో చేయబోయే మల్టీస్టారర్ సినిమా తర్వాత తలైవా సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తారని, అదే ఆయన చివరి చిత్రమని కోలీవుడ్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది.
Also Read : Meghamsh Srihari : శ్రీహరి కొడుకు హీరోగా కొత్త సినిమా.. మేఘాంశ్ శ్రీహరి పాన్ ఇండియా సినిమా..
జైలర్-2 షూటింగ్లో బిజీగా ఉన్న రజినీ ఈ సినిమా అయిపోయాక విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తమిళ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. రిటైర్మెంట్పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 75 ఏళ్ల వయసులోనూ యువ హీరోలతో పోటీపడుతున్న సూపర్ స్టార్ ఇంకా కొన్ని ప్రాజెక్టులు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. రజినీ సినిమాలకు ప్యాకప్ చెప్పేస్తారన్న వార్తలు ట్రెండింగ్‌లో ఉండటంతో తలైవా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మరి దీనిపై రజినీకాంత్ స్పందిస్తారా చూడాలి.
