Mahesh Babu : గౌతమ్‌కు అప్పుడే 18 ఏళ్లు.. మహేశ్ బాబు, నమ్రతల స్పెషల్ పోస్టులు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టిన రోజు నేడు.

Superstar Mahesh Babu birthday wishes to son Gautam Ghattamaneni
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు మహేశ్ బాబు. ఈ మేరకు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.
’18వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సమయాన్ని ఆస్వాదించు. అలాగే నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. నీకు తండ్రిని అయినందుకు చాలా గర్వంగా ఉంది.’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
Bandla Ganesh : తల్లి తండ్రులు నాకు జన్మనిస్తే.. పవన్ కళ్యాణ్ నాకు బతుకునిచ్చాడు.. బండ్ల గణేష్ కొత్త స్పీచ్ వైరల్..
View this post on Instagram
అలాగే మహేశ్ సతీమణి నమ్రత శిరోధ్కర్ సైతం తన తనయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కొత్త ప్రారంభాలకు! పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ రోజు నీ జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అలాగే తల్లిదండ్రులుగా మేము గర్వపడే రోజు. నీవు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండూ.’ అని నమత్రా రాసుకొచ్చింది.
View this post on Instagram