ఆరోగ్యసేతు యాప్‌ని యూజ్ చేయండి.. సేఫ్‌గా ఉండండి..

  • Published By: sekhar ,Published On : June 30, 2020 / 01:18 PM IST
ఆరోగ్యసేతు యాప్‌ని యూజ్ చేయండి.. సేఫ్‌గా ఉండండి..

Updated On : June 30, 2020 / 2:48 PM IST

ఇప్పటికే మన దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో కరోనా కేసులు రోజురోజుకీ మరింతగా పెరుగుతున్నాయి. దానితో ప్రజలు ఎక్కడికక్కడ మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విషయమై ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతూ సోషల్ మీడియా ద్వారా మెసేజ్ షేర్ చేశాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడికక్కడ సామాజిక దూరం పాటించడంతో పాటు ప్రభుత్వం వారు సూచించిన ఆరోగ్యసేతు యాప్ ని తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు కరోనా పాజిటివ్ కేసుల అలర్ట్స్ ని పొందడం, మనకు దగ్గర్లో వ్యాధి సోకిన వారు ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవడంతో పాటు హెల్త్ కేర్ ఎమెర్జెన్సీ సెంటర్ల వివరాలు కూడా తెలుసుకోవచ్చని మహేష్ తన పోస్ట్‌లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలిపాడు.

https://www.instagram.com/p/CCA7anbHy-T/?utm_source=ig_web_copy_link

Read:ఎంటర్‌టైన్‌మెంట్ హోం డెలివరీ: OTTలో ఏడు పెద్ద సినిమాలు..