Surender Reddy: షూటింగ్‌లో గాయపడ్డ టాలీవుడ్ డైరెక్టర్.. గాయంతోనే మళ్లీ షూటింగ్!
టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ డైరెక్టర్ ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో అఖిల్‌తో కలిసి ‘ఏజెంట్’ అనే స్పై థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ‘ఏజెంట్’ మూవీ షూటింగ్‌లో డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గాయాలు అయ్యాయని చిత్ర యూనిట్ తెలిపింది.

Surender Reddy Gets Injured In Agent Shooting
Surender Reddy: టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ డైరెక్టర్ ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో అఖిల్‌తో కలిసి ‘ఏజెంట్’ అనే స్పై థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ‘ఏజెంట్’ మూవీ షూటింగ్‌లో డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గాయాలు అయ్యాయని చిత్ర యూనిట్ తెలిపింది.
Akhil Agent : న్యూ ఇయర్ విషెస్ చెప్పిన ఏజెంట్ అఖిల్.. మేకింగ్ వీడియో అదుర్స్!
ఏజెంట్ మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో దర్శకుడు సురేందర్ రెడ్డి కాలికి గాయాలు అయ్యాయి. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సను అందించారు చిత్ర యూనిట్ సభ్యులు. అయితే చికిత్స అనంతరం ఆయన గాయంతోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొనడంతో అందరూ ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
స్టైలిష్ డైరెక్టర్‌తో అఖిల్ 5 ఫిక్స్..
కాలికి కట్టుతోనే ఆయన సినిమా షూటింగ్‌ను కొనసాగించారు. ఇక ఈ సినిమాలో అఖిల్ అల్ట్రా స్టైలిష్ పాత్రలో నటిస్తుండగా, మళయాల స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, సురేందర్ రెడ్డి గాయానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.