Suresh Babu: నారప్ప తెచ్చే వసూళ్లు.. ఒక్క రూపాయి కూడా ముట్టుకోరట!
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు వరుసగా రీ-రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు రీ-రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా గతంలో థియేటర్స్‌లో రిలీజ్ అయిన చిత్రాలే. కానీ, ఇప్పుడే నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా ఒకటి థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. అదే విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప.

Suresh Babu About Narappa Re-Release
Suresh Babu: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు వరుసగా రీ-రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు రీ-రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా గతంలో థియేటర్స్‌లో రిలీజ్ అయిన చిత్రాలే. కానీ, ఇప్పుడే నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా ఒకటి థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. అదే విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప.
Suresh Babu : రాజేష్ ఖన్నాతో గొడవ.. ప్రేమ్ నగర్ షూటింగ్ ఆపేశాం..
కరోనా ప్రభావంతో ఈ సినిమాను గతంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నిర్మాత డి.సురేష్ బాబు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ‘నారప్ప’ మంచి కంటెంట్ ఉన్న సినిమా అని.. ఈ సినిమాను ఓటీటీలో ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారని.. ఇప్పుడు రీ-రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం జనాలు థియేటర్లకు ఖచ్చితంగా వస్తారని ఆయన అన్నారు.
Narappa: ఎనీ సెంటర్.. సింగిల్ డే.. అంటోన్న నారప్ప!
ఇక ఈ సినిమా రీ-రిలీజ్‌తో వచ్చే వసూళ్లను తాము తీసుకోబోమని.. ఇతర సినిమాల మాదిరిగానే తాము కూడా ఈ సినిమా రీ-రిలీజ్ వసూళ్లను చారిటీకి ఇస్తామని ఆయన తెలిపారు. ఇలా సురేష్ బాబు నారప్ప సినిమా గురించి మాట్లాడటంతో మరోసారి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.