సర్జికల్ దాడిపై టాలీవుడ్ సెల్యూట్ వైబ్రేషన్స్

సర్జికల్ దాడిపై టాలీవుడ్ సెల్యూట్ వైబ్రేషన్స్

Updated On : December 24, 2024 / 4:44 PM IST

పుల్వామా ఉగ్రదాడికి విషాదంలో మునిగిపోయిన భారత్.. 2019, ఫిబ్రవరి 26 మంగళవారం జరిగిన సర్జికల్ స్ట్రైక్‌తో ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. ఈ ఘటన పట్ల దేశంలో ప్రతి ఒక్క పౌరుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాడు. ఎందరు స్పందించినా తమ అభిమాన తారలు చేసే ట్వీట్లకు, స్పందనకు విశేషాదరణ ఉంటుంది.

ఈ ఘటన పట్ల టాలీవుడ్ యువ హీరోలంతా భారత ఎయిర్ ఫోర్స్‌ను తెగ పొగిడేస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి గర్వపడుతున్నాం. ధైర్యస్థులైన పైలట్స్‌కు సెల్యూట్ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం మహేశ్ మహర్షి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

టాలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా.. బుల్లెట్ దిగిందా లేదా? పాక్‌లోకి దూరి దూరి చంపేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సెల్యూట్. జనగనమన’ అంటూ ట్వీట్ చేశారు.
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టైల్‌లో స్పందించారు. ‘ఏ పాకిస్తాన్, మీరొకటి వేస్తే.. మేం 4 వేస్తాం’ అని ట్వీట్ చేశాడు.