Etharkkum Thunindhavan : సూర్య సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..
వెర్సటైల్ యాక్టర్ సూర్య-పాండిరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎదర్కుం తునిందవన్’ మార్చి 10న విడుదల కానుంది..

Etharkkum Thunindhavan
Etharkkum Thunindhavan: గతకొద్ది కాలంగా ఇండియన్ సినిమాలన్నీ డైలమాలో ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాల రిలీజుల విషయంలో క్లారిటీ లేదు.. డేట్స్ మధ్య క్లాష్ తప్పడం లేదు.. పాన్ ఇండియా సినిమాలు వస్తే పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి. ఇంతలో మరో కొత్త వైరస్ వచ్చి పడింది. మళ్లీ నైట్ కర్ఫ్యూలు, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో అల్లకల్లోంగా మారింది.
Tollywood : టాలీవుడ్‌లో ఫుల్ జోష్.. విడుదలకు క్యూ కడుతున్న పెద్ద సినిమాలు..
కట్ చేస్తే.. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా విడుదల తేదీలు ఖరారు చేసుకుంటున్నాయి. మంగళవారం విలక్షణ నటుడు సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
తమిళ్‌తో పాటు తెలుగులోనూ ప్రేక్షకాదరణ, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు స్టార్ హీరో సూర్య. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలతో సాలిడ్ హిట్స్ అందుకుని ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాకుండా.. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా పొందారు.
Jai Bhim : ‘జై భీమ్’ సత్తా.. మరో మూడు అవార్డులు..
సూర్య టాలెంటెడ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో నటించిన సినిమా.. ‘ఎదర్కుం తునిందవన్’.. సూర్యకి హీరోగా ఇది 40వ సినిమా. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. కళానిధి మారణ్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలకు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Soorarai Pottru : సూర్య సినిమా రీమేక్ చేస్తున్నా.. కన్ఫమ్ చేసిన అక్షయ్ కుమార్..
సినిమాను ఫిబ్రవరి 4న థియేటర్లలో రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ మార్చి 10న ఫిక్స్ అయ్యారు. ఇటీవలే సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ టీమ్ U/A సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాల 38 సెకన్లకు ఫిక్స్ చేశారు. తెలుగు రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.