Suriya – Karthi : గొప్ప మనసు చాటుకున్న కోలీవుడ్ బ్రదర్స్.. చెన్నై వరదలు సహాయం కోసం..

చెన్నై వరదలు వల్ల కరెంటు పోవడం, కమ్యూనికేషన్ కట్ అవ్వడం, ఇళ్లలోకి వరద నీరు కొట్టుకురావడంతో ఆహారం కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రజల సమస్యలు చూసిన సూర్య, కార్తీ..

Suriya – Karthi : గొప్ప మనసు చాటుకున్న కోలీవుడ్ బ్రదర్స్.. చెన్నై వరదలు సహాయం కోసం..

SURIYA KARTHI ANNOUNCED DONATION for MICHAUNG CYCLONE RELIEF WORK

Updated On : December 5, 2023 / 7:33 PM IST

Suriya – Karthi : కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీ తమ సినిమాలతో మాత్రమే కాదు, తమ గొప్ప ఆలోచనలతో కూడా అభిమానుల మనసు గెలుచుకుంటుంటారు. కష్టాల్లో ఉన్నవారికి చెయ్యి అందిస్తూ, సోషల్ సర్వీస్ లు చేస్తూ నిజమైన హీరోలు అనిపించుకుంటుంటారు. తాజాగా ఈ ఇద్దరు అన్నదమ్ములు చెన్నై వరదల భద్రత కోసం సహాయం ప్రకటించారు. చెన్నై నగరాన్ని మిగ్‌జామ్ తుపాను వణికిస్తోంది. ఈ వరద బీభత్సంతో సాధారణ ప్రజలు మాత్రమే కాదు సెలబ్రిటీస్ సైతం కష్టాలు ఎదుర్కొంటున్నారు.

స్టార్ హీరోలు సైతం సహాయం కోసం అర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ వరదలు వల్ల కరెంటు పోవడం, కమ్యూనికేషన్ కట్ అవ్వడం, ఇళ్లలోకి వరద నీరు కొట్టుకురావడంతో ఆహారం కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రజల సమస్యలు చూసిన సూర్య, కార్తీ.. సహాయక చర్యలు కోసం 10 లక్షల రూపాయిలు డొనేట్ చేశారు. ఇక ఇద్దరు అన్నదమ్ముల చేసిన పనికి తమ అభిమానులతో పాటు ఇతర ఫ్యాన్స్ కూడా హ్యాట్సాఫ్ అంటున్నారు.

Also read : Aamir Khan : చెన్నై వరదల్లో చిక్కుకున్న ఆమీర్ ఖాన్.. ఫోటోలు వైరల్..

ఇక తమ హీరోలతో పాటు అభిమాన సంఘాలు కూడా తమ వంతు సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరి అన్నదమ్ముల ఫ్యాన్స్ తో విజయ్, విశాల్ తదితర హీరోల ఫ్యాన్స్ కూడా వరదల్లో చిక్కుకున్నవారికి సహాయం అందిస్తూ వస్తున్నారు. కాగా ఈ వరదల్లో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ కూడా చిక్కుకున్నారు. రక్షక సిబ్బంది ఆయన రక్షించి సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. ఆమీర్ తో పాటు తమిళ్ హీరో విష్ణు విశాల్ ని కూడా రక్షక సిబ్బంది రక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక సూర్య, కార్తీ సినిమాల విషయానికి వస్తే.. సూర్య ప్రస్తుతం ‘కంగువ’ సినిమాలో నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని శివ డైరెక్ట్ చేస్తున్నారు. కార్తీ ‘వా వాథియారే’ అనే సినిమాలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు. మరి ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.