Suriya: ‘కరుప్పు’ మూవీ పేరు మారింది.. తెలుగు టైటిల్ ఏంటో తెలుసా?
సూర్య(Suriya) కరుప్పు మూవీ టైటిల్ మార్చుతూ అధికారిక ప్రకటన చేసిన మేకర్స్.
suriya karuppu movie title changed in telugu
- కరుప్పు టైటిల్ మార్చిన మేకర్స్
- తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్
- ఆనందం వ్యక్తం చేస్తున్న సూర్య తెలుగు ఫ్యాన్స్
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, విలక్షణ దర్శకుడు ఆర్.జె. బాలాజీ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కరుప్పు’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సూర్య(Suriya) సరసన స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తుండటంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు.
Yellamma: అందుకే దేవి శ్రీని తీసుకున్నాం.. ఎట్టకేలకు ‘ఎల్లమ్మ’పై క్లారిటీ ఇచ్చిన వేణు
ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ మధ్య కాలంలో తమిళ టైటిల్స్‌నే నేరుగా తెలుగులో వాడుతున్నప్పటికీ, ఈ చిత్రం విషయంలో మాత్రం మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తెలుగు నేటివిటీకి, ఇక్కడి మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాకు ‘వీరభద్రుడు’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ పేరు వినడానికే చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి హైప్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సూర్య మార్క్ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్, ఆర్.జె. బాలాజీ మేకింగ్ శైలి ఈ చిత్రానికి ప్రధాన బలంగా మారనున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘వీరభద్రుడు’ మే 14న భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. మరి చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సూర్య ఈ సినిమాతో హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.

