Yellamma: అందుకే దేవి శ్రీని తీసుకున్నాం.. ఎట్టకేలకు ‘ఎల్లమ్మ’పై క్లారిటీ ఇచ్చిన వేణు
'ఎల్లమ్మ(Yellamma)' సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకోడంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన దర్శకుడు వేణు.
Venu Yeldandi interesting comments on Yellamma movie
- ఎల్లమ్మ సినిమాపై క్లారిటీ ఇచ్చిన వేణు
- కథానుసారమే దేవి శ్రీ ప్రసాద్ ఎంపిక
- ఆసక్తికర కామెంట్స్ చేసిన దర్శకుడు
Yellamma: ‘బలగం’ సినిమాతో హృదయాలను హత్తుకునే విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు ఎల్దండి. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని ‘ఎల్లమ్మ’ సినిమాను మొదలుపెట్టాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కథానాయకుడిగా నాని, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి స్టార్స్ నటిస్తారని రకరకాల ప్రచారాలు సాగాయి. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ పాత్ర కోసం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ను ఎంపిక చేయడం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రం ద్వారా వెండితెరపై నటుడిగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు.
Rashmika: రష్మిక ఖాతాలో మరో అరుదైన ఘనత.. జపాన్ వేదికగా మెరవనున్న ‘నేషనల్ క్రష్’
అయితే, ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ ను ఎన్నుకోవడం పై దర్శకుడు వేణు క్లారిటీ ఇస్తూ, సినిమా కోసం తాను తీసుకునే ప్రతి నిర్ణయం కథా గమనానికి అనుగుణంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ‘ఎల్లమ్మ(Yellamma)’ కథకు ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉన్న నటుడు అవసరమని అనుకున్నాం. మొదట వేరే నటులను అనుకున్నప్పటికీ, సినిమా స్పాన్ పెరుగుతున్న కొద్దీ కథలో మార్పులు వచ్చాయని వివరించారు. కథలోని సహజత్వం (రా-నెస్), భావోద్వేగాలను పండించడానికి దేవి శ్రీ ప్రసాద్ అయితేనే సరిగ్గా సరిపోతారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వేణు తెలిపారు.
కథలోని కంటెంట్‌ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్న వేణు, దేవి శ్రీ ప్రసాద్‌ను ఒక కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దేవి, నటుడిగా ఎల్లమ్మ సినిమాలో ఎలా ఒదిగిపోతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బలగం తరహాలోనే ఈ సినిమా కూడా మట్టి వాసనతో కూడిన ఎమోషనల్ డ్రామాగా రానుంది. ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
