సూర్యతో శివ సినిమా
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోయే ఈ సినిమాలో సూర్యని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తాడట శివ..

కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోయే ఈ సినిమాలో సూర్యని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తాడట శివ..
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవ డైరెక్షన్‌లో ఎన్‌జీకే అనే సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పడు సూర్య 39 వ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తెలుగులో సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. శౌర్యం, శంఖం, దరువు వంటి సినిమాలు డైరెక్ట్ చేసి, తమిళనాట తల అజిత్‌తో వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన శివ దర్శకత్వంలో సూర్య తన తర్వాతి సినిమా చెయ్యబోతున్నాడు.
స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై సూర్య కజిన్ కె.ఇ.జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని నిర్మించనున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోయే ఈ సినిమాలో సూర్యని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తాడట శివ.. త్వరలో హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్ వివరాలు తెలియనున్నాయి.
Also Read : కోట్ల మందికి ఇదే దిక్కు : 123456.. మీ పాస్‌వర్డ్ మాకు తెలుసు
వాచ్ ఎన్‌జీకే టీజర్..