సూర్య, వెట్రి మారన్ కాంబోలో కలైపులి ఎస్. థాను సెన్సేషనల్ మూవీ ‘‘వాడివాసల్’’..
‘సింగం’ సూర్య హీరోగా ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం ‘వాడివాసల్. హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదలచేసిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ధనుష్, కలైపులి ఎస్. థాను, వెట్రి మారన్ కాంభినేషన్‌లో వచ్చిన ‘అసురన్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ రచయిత సీఎస్ చెల్లప్ప రాసిన నవల ఆధారంగా జల్లికట్టు నేపథ్యంలో ‘వాడివాసల్’ చిత్రం తెరకెక్కనుంది.
సూర్య, వెట్రి మారన్ కాంబినేషన్‌లో ప్రెస్టీజియస్‌గా రూపొందుతోన్న ఈ మూవీ మా బేనర్‌లో మరో సెన్సేషనల్ సినిమా కాబోతుందని నిర్మాత కలైపులి ఎస్. థాను అన్నారు. సూర్య నటిస్తున్న 40వ సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
సింగం సూర్య హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఆర్. వేల్‌రాజ్, సంగీతం: జి.వి. ప్రకాశ్, ఆర్ట్: జాకీ, నిర్మాత: కలైపులి ఎస్. థాను, దర్శకత్వం: వెట్రి మారన్.