సుశాంత్ సింగ్ కు కాలిఫోర్నియా అసెంబ్లీ గౌరవం

  • Published By: madhu ,Published On : August 15, 2020 / 02:19 PM IST
సుశాంత్ సింగ్ కు కాలిఫోర్నియా అసెంబ్లీ గౌరవం

Updated On : August 15, 2020 / 4:43 PM IST

బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో..సుశాంత్ రాజ్ పుత్ సింగ్ మరణం ఇంకా ప్రకంపనలు రేకేత్తిస్తూనే ఉంది. అతను ఆత్మహత్య చేసుకోలేదని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు.



ఈ క్రమంలో 2020, ఆగస్టు 15వ తేదీ శనివారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా..సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సేవలను కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ గౌరవించింది. ఆయన సోదరి శ్వేతా సింగ్…కాలిఫోర్నియా అసెంబ్లీ సర్టిఫకేట్ ను అందించింది.



దీనికి సంబంధించిన…సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాలీవుడ్‌కు వెళ్లాలని సుశాంత్ ఎన్నోసార్లు అనుకున్నాడని అంటున్నారు. మొత్తానికి సుశాంత్ కు కాలిఫోర్నియా అసెంబ్లీ గౌరవించడం అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

‪On the occasion of Indian Independence Day California recognizes my brother’s (Sushant) overall contribution to society. California is with us…. are you? Thanks for your support California. ?#GlobalPrayersForSSR #Warriors4SSR #CBIForSSR #Godiswithus ‬

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on


బ్రదర్ సుశాంత్ సమాజానికి చేసిన సేవలను కాలిఫోర్నియా గుర్తించిందని, కానీ మరి మీరు అంటూ ప్రశ్నించారు. కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ నుంచ ఈ గౌరవాన్ని అందుకోవడాన్ని గొప్పగా భావిస్తున్నట్లు శ్వేతా సింగ్ తెలిపారు.



ఇండియన్ సినిమాకు, సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా..గౌరవించడం సంతోషంగా ఉందన్నారు. మద్దతును అందిస్తున్న ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీతో పాటు అసెంబ్లీ మెంబర్స్‌కు తన కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.