బావ బన్నీనే బెటర్ : తమ్ముడు ఆ సినిమా రీమేక్ చేయాలి..
చెర్రీ కంటే బన్నీనే బెస్ట్ అంటున్న మెగా డాటర్ సుస్మిత కొణిదెల..

చెర్రీ కంటే బన్నీనే బెస్ట్ అంటున్న మెగా డాటర్ సుస్మిత కొణిదెల..
మా తమ్ముడు రామ్ చరణ్ కంటే బావ అల్లు అర్జునే బెటర్ డ్యాన్సర్ అంటూ ప్రశంసించింది మెగా డాటర్ సుస్మిత కొణిదెల.. ఇటీవల ఓ ఇంటర్వూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవే. ఆయన తర్వాత మన హీరోలు స్టెప్పులేసినా మెగాస్టార్ ఈజ్, గ్రేస్‌ను మ్యాచ్ చేయలేకపోయారనేది వాస్తవం.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ జనరేషన్ హీరోలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లే.. వీళ్లల్లో ఎవరు బెస్ట్ అంటే మాత్రం చెప్పలేం.. కానీ, చరణ్ సోదరి సుస్మిత మాత్రం రెండో ఆలోచన లేకుండా జవాబు చెప్పేయడం విశేషం. చెర్రీ, బన్నీ ఇద్దరిలో స్టైలిష్ స్టార్ బెటర్ డ్యాన్సర్ అంటూ కొనియాడారామె.
అలాగే చరణ్ ఏ మెగా రీమేక్ (చిరంజీవి నటించిన చిత్రం) చేస్తే బావుంటుంది అని అడగ్గా.. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మెగా పవర్ స్టార్ చేస్తే చూడాలని ఉందని చెప్పారు. ఈతరం జగదేకవీరుని సరసన నిన్నటి తరం అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు.. జాన్వీ కపూర్ నటించాలని కూడా సుస్మిత చెప్పారు. చరణ్, జాన్వీ కాంబినేషన్‌లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ రీమేక్ కోసం మెగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రయత్నాలు చేశారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.