Sushmita Sen : బ్యాక్ టు షూటింగ్ సెట్స్.. గుండెపోటు నుంచి కోలుకున్న సుస్మితా సేన్ పోస్ట్..
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ (Sushmita Sen) ఇటీవల గుండెపోటుకు గురైనట్లు సంగతి తెలిసిందే. తాజాగా గుండెపోటు నుంచి కోలుకున్న సుస్మితా మళ్ళీ షూటింగ్ ల్లో బిజీ అవుతుంది.

Sushmita Sen back to shooting sets after recovery
Sushmita Sen : బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ (Sushmita Sen) ఇటీవల గుండెపోటుకు గురైనట్లు తెలియజేసిన సంగతి తెలిసిందే. మార్చి 2వ తారీఖున సుస్మితా సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. రెండు రోజుల క్రితం నా గుండెపోటు వచ్చింది. వైద్యులు నాకు యాంజియోప్లాస్టీ (Angioplasty) చేసి గుండెలో స్టెంట్ వేశారు. ఇక పై ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఉండవచ్చని డాక్టర్లు ధీమా ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయం తెలియడంతో అభిమానులు అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
Sushmita Sen: బ్రేకింగ్ న్యూస్.. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌కు గుండెపోటు.. షాక్‌లో ఫ్యాన్స్!
ఇక గుండెపోటు నుంచి కోలుకున్న సుస్మితా మళ్ళీ షూటింగ్ ల్లో బిజీ అవుతుంది. ఇటీవల ఒక ర్యాంప్ వాక్ లో పాల్గొని సందడి చేయడమే కాకుండా, తాను నటించిన ‘తాళి’ (Taali) వెబ్ సిరీస్ డబ్బింగ్ కూడా పూర్తి చేసింది. తాజాగా కెమెరా ముందుకి వచ్చి షూటింగ్ లో కూడా పాల్గొంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియో పోస్ట్ వేసింది. ఆ వీడియోలో సుస్మితా.. తన మొఖంతో పలు హావభావాలు పలికిస్తూ కనిపిస్తుంది. ఇక ఆ పోస్ట్ కింద ఇలా రాసుకొచ్చింది.
Sushant Singh Rajput : సుశాంత్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..
నా యాంజియోప్లాస్టీ పూర్తి అయ్యి నెల అయ్యింది. ఇష్టమైన పని చేయడమే వలనే నేను త్వరగా కోలుకోగలిగాను. లైట్స్, కెమెరా, యాక్షన్, మ్యూజిక్.. ఇవన్నీ నా మదిలో రిపీట్ ప్లే అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి థాంక్యూ అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ పోస్ట్ కి అభిమానులు రెస్పాండ్ అవుతూ.. సుస్మితా సేన్ పై తమ అభిమానం, ప్రేమని వ్యక్తపరుస్తున్నారు.
View this post on Instagram