Jinn Movie : సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘జిన్’ ఓపెనింగ్.. టైటిల్ వెరైటీగా ఉందే..
తాజాగా జిన్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Suspense Horror Thriller Jinn Movie Opened with Pooja Ceremony
Jinn Movie : అమిత్ రావ్ హీరోగా తెరకెక్కుతున్న సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘జిన్’. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్ పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మాణంలో చిన్మయ్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా జిన్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Also Read : Allu Arjun : ‘బన్నీ రికార్స్ మోత’.. పుష్ప 50 రోజుల కలెక్షన్, పుష్ప 2కి కేవలం రెండు రోజుల్లోనే..
ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఈ సినిమాకు డైలాగ్స్ రాసిన వరదరాజ్ నాకు మంచి స్నేహితుడు. జిన్ సినిమాకు వరదరాజ్ కో ప్రొడ్యూసర్ గా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాను కన్నడ తెలుగు బైలింగ్వల్ మూవీగా నిర్మిస్తున్నారు అని తెలిపారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. జిన్ టైటిల్ బాగుంది. సస్పెన్ హారర్ థ్రిల్లర్ జానర్స్ కు పోటీ తక్కువగా ఉంటుంది. మంచి కంటెంట్ ఉంటే ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అని ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ సినిమా డైలాగ్ రైటర్, కో ప్రొడ్యూసర్ వరదరాజ్ చిక్కబళ్లాపుర మాట్లాడుతూ.. సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీస్ చాలా చూసి ఉంటాం. కానీ జిన్ కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది. అందుకే ఈ సినిమాకు డైలాగ్స్ రాయడంతో పాటు కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాను. త్వరలోనే జిన్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. నిర్మాత నిఖిల్ ఎమ్ గౌడ మాట్లాడుతూ.. జిన్ సినిమాను తెలుగు, కన్నడ బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నాం. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని తెలిపారు.
డైరెక్టర్ చిన్మయ్ రామ్ మాట్లాడుతూ.. జిన్ సినిమా డైరెక్టర్ గా నాకు ఫస్ట్ మూవీ. ఇది మంచి కథ. స్క్రిప్ట్ పర్పెక్ట్ గా వచ్చేందుకు చాలా టైమ్ తీసుకున్నాం. హైదారాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. హీరో అమిత్ రావ్ మాట్లాడుతూ.. జిన్ సినిమా స్క్రీన్ ప్లే కాంప్లికేటెడ్ గా ఉంటుంది. మంచి విజువల్స్ తో సినిమా చేయబోతున్నాం. ఇలాంటి మంచి స్క్రిప్ట్ తో హీరోగా రావడం సంతోషంగా ఉంది అని అన్నారు.