Swapna Paper Art : పేపర్‌ని కట్ చేస్తూ అద్భుతాలు సృష్టిస్తుంది.. మన సెలబ్రిటీల ఫోటోలని పేపర్ కట్ చేస్తూ ఎలా చేసిందో చూడండి..

స్వప్న స్వామి అని మహిళ పేపర్ ని కేవలం కత్తెరతో కట్ చేస్తూ మనిషి ఆకారాన్ని తీసుకొస్తుంది. తాజాగా ఈ స్వప్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చింది.

Swapna Paper Art : పేపర్‌ని కట్ చేస్తూ అద్భుతాలు సృష్టిస్తుంది.. మన సెలబ్రిటీల ఫోటోలని పేపర్ కట్ చేస్తూ ఎలా చేసిందో చూడండి..

Swapna Swamy Paper Art goes Viral after coming to Sridevi Drama Company

Updated On : April 15, 2024 / 11:03 AM IST

Swapna Paper Art : ఒక్కో మనిషిలో ఒక్కో ట్యాలెంట్ ఉంటుంది. ఆ ట్యాలెంట్ సరిగ్గా వాడుకుంటే కచ్చితంగా పాపులర్ అవుతారు, లైఫ్ లో సక్సెస్ అవుతారు. ఈ అమ్మాయి కూడా తన ట్యాలెంట్ ని కరెక్ట్ గా వాడుకొని లైఫ్ లో ఎదుగుతుంది. స్వప్న స్వామి అని మహిళ పేపర్ ని కేవలం కత్తెరతో కట్ చేస్తూ మనిషి ఆకారాన్ని తీసుకొస్తుంది. మన ఎవరి ఫోటో ఇచ్చినా వాళ్ళ ఫొటోలాగా పేపర్ ని కట్ చేస్తూ తయారుచేస్తుంది.

ఇప్పటికే స్వప్న పవన్ కళ్యాణ్, సోనూసూద్, పునీత్ రాజ్ కుమార్, సూర్య, రామ్ చరణ్, సమంత.. లాంటి ఎంతోమంది సెలబ్రిటీలతో పాటలు జగన్, చంద్రబాబు.. లాంటి పలువురు పొలిటీషియన్స్ ని కూడా పేపర్ కటింగ్ తయారుచేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాక మీకెవరికైనా మీ ఫోటోలు కూడా ఇలా పేపర్ కటింగ్ తో కావాలంటే ఆర్డర్ చేసి చేయించుకోవచ్చు. తాజాగా ఈ స్వప్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చింది.

Also Read : Chiranjeevi : డూప్ లేకుండా 68 ఏళ్ళ వయసులో మెగాస్టార్ యాక్షన్ సీన్స్.. ‘విశ్వంభర’ కోసం చిరు సాహసం..

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ చేయగా ఇందులో.. పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చేలా కత్తెరతో పేపర్ ని కట్ చేస్తూ నిమిషాల్లో చేసేసింది. దీంతో షోలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అలాగే ఇంద్రజ, రష్మీలకు ముందే కట్ చేసి తీసుకొచ్చిన వారిలాగే ఉండే పేపర్ డిజైన్స్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ ప్రోమో రిలీజవ్వడంతో స్వప్న చేసే పేపర్ ఆర్ట్ వైరల్ గా మారింది. దీంతో అంతా తన సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ని ఫాలో అవుతున్నారు. పేపర్ కటింగ్స్ మాత్రమే కాక ఇంకా పలు ట్యాలెంట్స్ ఉన్నాయి తన దగ్గర. తన ట్యాలెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులర్ అవుతుంది స్వప్న. మీకు కూడా పేపర్ కటింగ్ తో మీ ఫొటోలు కావాలంటే ఆమెని కాంటాక్ట్ అవ్వండి.

 

 

 

View this post on Instagram

 

A post shared by swapnaswamy (@drawingarts8143)

 

View this post on Instagram

 

A post shared by swapnaswamy (@drawingarts8143)

 

View this post on Instagram

 

A post shared by swapnaswamy (@drawingarts8143)

 

View this post on Instagram

 

A post shared by swapnaswamy (@drawingarts8143)

 

View this post on Instagram

 

A post shared by swapnaswamy (@drawingarts8143)