హీరోకి ఇచ్చే దాంట్లో పది శాతం కూడా ఇవ్వట్లేదు: తాప్సీ

  • Published By: vamsi ,Published On : November 23, 2019 / 03:23 PM IST
హీరోకి ఇచ్చే దాంట్లో పది శాతం కూడా ఇవ్వట్లేదు: తాప్సీ

Updated On : November 23, 2019 / 3:23 PM IST

కాంట్రవర్శీ టాపిక్‌ల గురించి మాట్లాడంలో ఏ మాత్రం తడబడరు హీరోయిన్ తాప్సీ పన్ను. తెలుగులో ఝుమ్మంది నాధం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తర్వాతి కాలంలో బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఇటీవలికాలంలో పింక్ సినిమాతో బాలీవుడ్ సూపర్ హిట్ అందుకున్న ఈ భామ తనకు సినిమా కెరీర్ ఇచ్చిన రాఘవేంద్ర రావు గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఈ అమ్మడు లేటెస్ట్‌గా మరో సంచలన విషయంపై వ్యాఖ్యలు చేసింది. 

Taapsee Pannu

నేహా ధూపియా నిర్వహించే #NoFilterWithNeha అనే బాలీవుడ్‌ క్రేజీ ప్రోగ్రామ్‌లో ఈ భామ మాట్లాడింది. సినిమాల్లో మగ లీడ్‌కు హీరోయిన్ కంటే చాలా ఎక్కువగా ఇస్తారని, హీరోకు ఇచ్చే పారితోషికంలో హీరోయిన్లకు 5నుంచి 10శాతం మాత్రమే ఇస్తారని, ఇది కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. పురుష ఆధిపత్యం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా హీరోకి ఇచ్చినంత రెమ్యునరేషన్ హీరోయిన్‌కి ఇవ్వట్లేదని అన్నారు తాప్సీ.

ఇది ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు, ప్రతి పరిశ్రమలోనూ ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.  లింగ సమానత్వంను అందరూ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ నియమాలను సమానం చెయ్యాలని ఆమె అన్నారు. #GenderPay

ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడిపై సంచలన కామెంట్లు చేశారు తాప్సీ. బాలీవుడ్ సూపర్ స్టార్ అనీల్ కపూర్ కుమారుడు హర్షవర్థన్ కపూర్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. హర్షవర్ధన్ కపూర్ తొలి సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా.. రెండో సినిమాలో అవకాశం వచ్చింది. అతడు స్టార్ హీరో కుమారుడు కాబట్టే రెండో సినిమాలో అవకాశం దక్కింది. అదే స్థానంలో నేను ఉంటే అలా జరిగేది కాదు. అసలు కెరీరే ఉండేది కాదు అని అన్నారు.

ఇక తన వెడ్డింగ్ ప్లాన్స్ గురించి కూడా ఆసక్తికర విషయాలని బయట పెట్టింది. పిల్లలు కావాలని అనుకున్నప్పుడు మాత్రమే పెళ్లి గురించి ఆలోచిస్తానని అన్నారు. పెళ్ళి కాకుండానే పిల్లల్ని కనటం తనకు ఇష్టం లేదని.. తప్పకుండా పెళ్లి చేసుకున్నాకే కిడ్స్ ప్లాన్ చేస్తానని చెప్పుకొచ్చింది.