రిచ్ కపుల్..రిచ్ బేటా : కరీనా..సైఫ్ పిల్లాడి డైపర్స్ ఖర్చు రూ.కోటిన్నర..!!

బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల కొడుకు తైమూర్ అలీ ఖాన్ వార్తల్లో నిలిచాడు. ఈ బుడ్డోడి డైపర్స్ ఖర్చు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తమ ముద్దుల కుమారుడు తైమూర్ డైపర్ల కోసం సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ చేస్తోన్న ఖర్చుకు సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది. తైమూర్ కోసం ప్రత్యేకంగా డైపర్స్ తయారు చేయింటారు. దాని కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు.
బాలీవుడ్ స్టార్ కపుల్స్ అయిన కరీనా..సైఫ్ లు ఎంత ఫేమస్సో..తైమూర్‌కి దేశవ్యాప్తంగా అంత ఫేమస్ అయిపోయాడు. అతడికి కూడా దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కరీనా..సైఫ్ ఎంత రిచ్చో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరి ఆ వారి కొడుకు మరింత రిచ్ అనిపిస్తున్నాడు. ఈ బాలీవుడ్ కపుల్ తమ ముద్దుల కుమారుడు తైమూర్ డైపర్ల కోసం చేస్తోన్న ఖర్చుకు సంబంధించిన వార్త హాట్ టాపిగ్ గా మారింది.
తైమూర్ ఖాన్ డైపర్ కోసం ఈ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఓ కంపెనీతో సైఫ్ కోటిన్నర రూపాయల డీల్ కుదుర్చుకున్నారట. తైమూర్ కోసం ఆ కంపెనీ ప్రత్యేకంగా డైపర్లు తయారు ఇస్తుందట. ఆ బాలుడి కేర్ టేకర్‌కు నెలకు లక్షన్నర రూపాయలను ఆ దంపతులు చెల్లిస్తుంటారు. కుమారుడిపై వారు చూపిస్తోన్న శ్రద్ధ హాట్ టాపిక్‌గా మారింది.