Nandi awards: నంది అవార్డ్స్‌పై తలసాని కౌంటర్.. ఎవరు పడితే వాళ్లు అడిగితే ఇవ్వరు!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అందించే ప్రతిష్టాత్మకమైన ‘నంది అవార్డుల’ ప్రదానంపై కొంత కాలంగా రగడ నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు.

Talasani Srinivas Comments On Nandi Awards
Nandi Awards: తెలుగు సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ‘నంది అవార్డులు’ గతకొంత కాలంగా నిలిచిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వేరు పడ్డాక, ఈ అవార్డులను పట్టించుకునే వారు కరువయ్యారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇటు తెలంగాణలో కానీ, అటు ఆంధ్రాలో కానీ నంది అవార్డుల ఊసే లేదని పలువురు మండిపడుతున్నారు. అయితే తాజాగా నంది అవార్డులపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
Nandi Awards : నంది అవార్డ్స్ పై రచ్చ.. అమరావతిలో భూములు తీసుకున్నారు కదా.. నట్టి కుమార్!
చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు విగ్రహాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ దాసరి జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా రంగంలోని కార్మికులకు తమ ప్రభుత్వం నిత్యం అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఇక ఈ క్రమంలోనే నంది అవార్డుల ప్రదానంపై తలసాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Nandi Awards : అవార్డులపై మాటల మంటలు
రెండు తెలుగు రాష్ట్రాలు వేరుపడ్డాక నంది అవార్డుల ప్రదానం తగ్గిందని.. తమకు నంది అవార్డులు ఇవ్వాలని సినీ పరిశ్రమ నుండి ఎవరూ కూడా ప్రభుత్వాన్ని కోరలేదని ఆయన తెలిపారు. అలాగే, ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరు.. కొందరు మీడియా కనిపిస్తే ఉత్సాహంగా మాట్లాడతారు. మీడియా, ప్రేక్షకులు అలాంటి కామెంట్స్‌ను ఏమాత్రం పట్టించుకోవద్దని తలసాని కోరారు. ఇక వచ్చే ఏడాది నుండి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను అందజేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.