‘మహాసముద్రం’తో టాలీవుడ్‌కు తిరిగొస్తున్న సిద్ధార్థ్

Siddharth in MahaSamudram : వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్‌లో ‘మహాసముద్రం’ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి సిద్ధార్థ్ ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో నటించేందుకు అంగీకరించారు. చివరిసారిగా డబ్బింగ్ ఫిల్మ్ ‘గృహం’తో ఆయన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
చాలా కాలం తర్వాత సిద్ధార్థ్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు తిరిగొస్తున్నారు. సరైన స్క్రిప్ట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఎదురుచూస్తున్న ఆయనకు కొంచెం గ్యాప్ తర్వాత ‘మహాసముద్రం’ రూపంలో అలాంటి స్క్రిప్టు రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
https://10tv.in/actor-raj-tarun-orey-bujjiga-new-movie-to-be-released-in-telugu-ott-aha-on-oct-2/
అజయ్ భూపతి రాసిన పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో రూపొందే సినిమాలో ఇద్దరు ప్రతిభావంతులైన నటులు శర్వానంద్, సిద్ధార్థ్ లను ఒకే సినిమాలో తెరపై చూడటం కచ్చితంగా ప్రేక్షకులకు కన్నుల పండుగ అవుతుందనడంలో సందేహం లేదు.
సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి మాసివ్ బ్లాక్‌బస్టర్‌ను నిర్మించిన ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ.. దాని తర్వాత ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అయిన ‘మహాసముద్రం’ను నిర్మిస్తోంది.
సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రతి వారం ఒక సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ రానున్నది.
He is an ocean of talent and returns back to Telugu Cinema..Welcoming @Actor_Siddharth on board for #Mahasamudram ? @ImSharwanand @DirAjayBhupathi @AKentsOfficial @AnilSunkara1 #SidIsBack
More interesting updates soon! ? pic.twitter.com/HKgzlrHZW0
— AK Entertainments (@AKentsOfficial) September 18, 2020