స‌రిలేరు నీకెవ్వ‌రు ‘డాంగ్ డాంగ్’ సాంగ్‌ కి చిన్నారి స్టెప్పులు అదుర్స్

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 09:31 AM IST
స‌రిలేరు నీకెవ్వ‌రు ‘డాంగ్ డాంగ్’ సాంగ్‌ కి చిన్నారి స్టెప్పులు అదుర్స్

Updated On : January 13, 2020 / 9:31 AM IST

సూపర్‌స్టార్ మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కిన ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ మూవీ సంక్రాంతికి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మూవీలో త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ ‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా నా.. డాంగ్ డాంగ్’ అంటూ సాగే పాట అందరిని ఎంతగానో ఆక‌ట్టుకుంది.

అయితే సోషల్ మీడియాలో చాలామంది ఈ పాట‌ని పాడుకుంటూ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి కూడా ఈ పాటని పాడుతూ.. అందుకు త‌గ్గ‌ట్టు స్టెప్పులు వేస్తుంది. చిన్నారి ప‌ర్‌ఫార్మెన్స్‌ కి ఫిదా అయిన త‌మ‌న్నా త‌న ట్విట్ట‌ర్‌ లో వీడియో షేర్ చేస్తూ.. ఓ మై గాడ్, అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌. ఈ పార్టీ సాంగ్‌ ని ప్ర‌తి ఒక్క‌రు ఇష్ట‌ప‌డుతున్నారు అని పేర్కొంది.

ఈ సాంగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు డాన్స్ ఇరగదీశారు. దేవీశ్రీ ప్రసాద్ తన మార్క్ బీట్‌తో సంగీత ప్రేమికులని అలరించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మొత్తానికి ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకొని తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టింది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీతో కుటుంబ ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు.